వ్యభిచారం కేసులో ప్రముఖ నటి అడ్డంగా బుక్కవ్వడంతో షాక్ కు గురైన తమిళ సినీ పరిశ్రమ.. ఒకింత విస్మయాన్ని కూడా వ్యక్తం చేసింది. నటిగా గుర్తింపు తెచ్చుకని.. సీనియర్ నటిగా స్థిరపడిన తరువాత ఈజీ మనీ కోసం చెడుమార్గాన్ని అన్వేషించిన ప్రముఖ నటిని పోలీసులు అదుపులో తీసుకోగా ఇవాళ అమెను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి.. అనంతరం న్యాయమూర్తి అదేశాల మేరకు అమెను జుడీషియల్ రిమాండ్ కు తరలించారు. గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది అమ్మాయిలతో సెక్స్ రాకెట్ ను నడుపుతూ పోలీసులకు అడ్డండగా బుకైన నటి ఎవరా.. అని అడుగుతున్నారా.. అమె మరెవరో కాదు తమిళ సీనియర్ నటి సంగీత బాలన్.
చెన్నైలోని పనయూర్ లోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో అమ్మాయిలతో సంగీత బాలన్ వ్యభిచారాన్ని నుడుపుతున్నారని పోలీసులకు సమాచారం అందించింది. దీంతో వారు అకస్మికంగా దాడి చేయడంతో సంగీత బాలన్ సహా పలువురు యువతులు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సతీష్ అనే వ్యక్తి సంగీత బాలన్ కు వ్యభిచార నిర్వహణలో అండగా వుంటాడని సమాచారం. దీంతో వీరిద్దరినీ ఇవాళ ఎగ్మోర్ కోర్టులోని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు పోలీసులు. దీంతో న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది.
వ్యభిచారం చేస్తోన్న అమ్మాయిలు వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారని, ముఖ్యంగా వీరిలో ఉత్తరాదికి చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అమ్మయిలందరినీ నగరంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. కాగా, సంగీత బాలన్ 1996లో వచ్చిన తమిళ చిత్రం ‘కరుప్పు రోజా’ ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో టీవీ సీరియళ్ల ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యారు. అలాగే వల్లి, పిళ్లై నిలా, అవల్ (విజయ టీవీ), చెల్లామే (సన్ టీవీ), అన్నకొడియుమ్ ఎయింధు పెంగలుమ్, సబిత అల్లీస్ సభాపతి వంటి టీవీ షోలలోనూ సంగీత పాల్గొన్నారు. ప్రస్తుతం రాధికా శరత్ కుమార్తో కలసి ‘వాణి రాణి’ అనే టీవీ సీరియల్లో సంగీత నటిస్తున్నారు. ఈ సీరియల్లో రాధికా, సంగీత అక్కచెల్లెళ్లుగా కనిపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more