southwest monsoon hit telangana in two days మరికొన్ని గంటల్లో రాష్ట్రాన్ని పలకరించునున్న తొలకరి..

Imd forecasts southwest monsoon hit telangana in two days

Indian Meteorological Department, Telangana Monsoon, Monsoon, southwest monsoon, thunderstorms, gusty winds, hyderabad, telangana, andhra pradesh, rayalaseema, climatic conditions, rain fall, south west monsoon, telangana, coastal andhra, rayalaseema, rainfall, IMD

The conditions are turning to be favourable for southwest monsoon to advance into some parts of Telangana in the next 48 hours, the Met office said today.

మరికొన్ని గంటల్లో రాష్ట్రాన్ని పలకరించునున్న తొలకరి..

Posted: 06/05/2018 02:54 PM IST
Imd forecasts southwest monsoon hit telangana in two days

ప్రచండ భానుడి భగభగలతో గత మూడు మాసాలుగా అల్లాడిన తెలుగురాష్ట్రాల ప్రజలకు చల్లని కబురును అందించింది భారత వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు మరో 48 గంటల్లో తెలుగు రాష్ట్రాలను పలకరించనున్నాయి. తొలికరి చినుకుల కోసం పరవశిస్తున్న చెట్టూ చేమలతో పాటు అన్ని జీవరాసులను త్వరలోనే పలకరించనున్నాయి. వాస్తవానికి జూన్ 5నే తొలికరి జల్లులతో ఇక్కడి పుడమి పులకరించాల్సి వుండగా.. వాతావరణం అనుకూలించని కారణంగా ఒక్క రోజు అలస్యంగా అంటే బుధవారం తొలకరి పలకరించనుంది.

కేరళలో మూడు రోజుల ముందుగానే ప్రవేశించినా.. రాష్ట్రానికి మాత్రం మరో 48 గంటల తర్వాతే రుతుపవనాలు రానున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతు పవనాల రాకకు వాతావరణం అనుకూలించలేదని తెలిపింది. ఇప్పటికే కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాలకు నైరుతి పవనాలు వ్యాపించాయని, తెలంగాణలో జూన్‌ 6న అడుగుపెట్టనున్నాయని చెప్పింది. రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు.. బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇక తెలంగాణలోని పలు ప్రాంతాలకు కూడా బుధవారం రుతుపవనాలు చేరుకుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, వాతావరణంలో వచ్చిన మార్పులతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్‌, నల్లగొండల్లో అత్యధికంగా 41 డిగ్రీలు నమోదైంది. రుతుపవనాలు రాకతో.. ఈసారి మంచి వర్షాలు పడనున్నాయని ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పటికే రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాగా, ఇక రుతుపవనాల రాకతో పగటి ఉష్ణోగ్రతల్లో కూడా మార్పలు తప్పవని వాతావరణ శాఖ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : south west monsoon  telangana  coastal andhra  rayalaseema  rainfall  IMD  

Other Articles