young girl dies after jumping from 10th floor నీట్ ఫలితాల్లో మంచి ర్యాంకు రాలేదని యువతి..

Young girl commits suicide by jumping from 10th floor

girl, neet results, muskan singh, juslin kaur, disappionted, barkatpura, suicide, kachiguda, abids, mayuri building, hyderabad, crime

A Young Girl committed Suicide, jumping from a building in Abids in Hyderabad after she was deeply disappointed with the neet results which released ysterday, and commits suicide on Tuesday.

ITEMVIDEOS: నీట్ ఫలితాల్లో మంచి ర్యాంకు రాలేదని యువతి..

Posted: 06/05/2018 03:41 PM IST
Young girl commits suicide by jumping from 10th floor

హైదరాబాద్‌ అబిడ్స్‌లో విషాదం అలుముకుంది. ఉదయం ఓ యువతి పదో అంతస్థు భవనంపై నుంచి పడి మరణించింది. అయితే ఈ యువతి అత్మహత్యకు పాల్పడిందా.? లేక ఎవరైనా హత్య చేశారా.? లేక ప్రమాదవశాస్తు మరణం సంభవించిందా..? అన్న ప్రశ్నలు పోలీసులు ఎదుట నిలిచాయి. దీంతో వారు ఓ వైపు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అస్పత్రికి తరలిస్తూనే మరో వైపు దర్యాప్తును కూడా ప్రారంభించారు. అసలు ఈ యువతి ఎవరు.? అమె వివరాలేంటి అన్న వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు.

ముందుగా ఈ యువతి మరణం ప్రమాదమా.? హత్యా..? ఆత్మహత్య.? అని తెలుసుకునే పనిలో భాగంగా ముందుగా యువతి చేరుకున్న మయూరీ కాంప్లెక్స్‌ వద్దకు చేరుకున్న పోలీసులు అక్కడి సీసీ కెమెరాల్లో యువతి ఒంటిరిగా వచ్చిందా.? లేక తోడుగా ఎవరైనా వచ్చారా.? అన్న వివరాలను తెలుసుకున్నారు. యువతి ఒంటరిగానే ఇక్కడకు వచ్చిందని తెలుసుకున్నారు. పది అంతస్తులు ఎక్కే క్రమంలో ఓ చోట యువతని కొందరు ఎక్కడికి వెళ్తున్నావు అని కూడా అడిగినట్లు తెలుస్తుంది. అయితే పై అంతస్థుకు వెళ్తున్నట్లు చెప్పిన యువతి నేరుగా టెర్రస్ పైకి చేరుకుంది.

అయితే అమెను ధోరణి కాసింత అనుమానాస్పదంగా వుండటంతో అమె వెళ్లిన కొద్ది సేపటికీ వెనుకగా వచ్చిన కొందరు అమెను.. దూకవద్దని వారిస్తున్నా.. యువతి దూకేసిందని దర్యాప్తులో వెళ్లడైంది. ఇక సరిగ్గా అమె దూకే సమయంలో అవతలి భవనం నుంచి ఎవరో ఆ యువతిని వీడియో తీయగా, అది కూడా సంచలనంగా మారింది. పది అంతస్థుల పైనుంచి దూకేసరికి యువతి తలకు తీవ్రగాయాలై అమె అక్కడిక్కడే మరణించింది. దీంతో శవపరీక్ష నిమిత్తం ఆమె మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇక ఆ యువతి ఎవరు అని అన్వేషిస్తున్న పోలీసులు.. అమె పేరు జస్లిన్ కౌర్ అని తేల్చారు. యువతి బర్కత్ పురకు చెందినదని గుర్తించిన పోలీసులు అమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనేక మంది విద్యార్థుల మాదిరిగా అమె కూడా మెడికల్ సీటు కోసం నీట్ పరీక్షలు రాసిందని, కాగా క్రితం రోజు విడుదల చేసిన నీట్‌ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన.. స్లిన్ కౌర్.. అబిడ్స్‌కు వచ్చి ఈ ఘటనకు పాల్పడిందని పోలీసులు వివరించారు. తమ కూతురు మరణవార్తతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.

(Video Source: NTV Telugu)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : girl  neet results  muskan singh  juslin kaur  disappionted  barkatpura  suicide  kachiguda  abids  mayuri building  hyderabad  crime  

Other Articles