కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకరం చేసి పక్షం రోజులు అయిన తరువాత ఆ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఇవాళ జరిగింది. రాజ్ భవన్ లోని గ్లాస్ హాల్లో ఈ కార్యక్రమం కాంగ్రెస్, జేడీఎస్ కూటమి వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యుల మధ్య కొనసాగింది. రాష్ట్రంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి బలనిరూపణ చేసిన తరువాత.. అటు బీజేపి, ఇటు రాజకీమ విమర్శకులు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం.. ప్రజలకు పాలనాసౌలభ్యాన్ని అందించకపోవడంపై విమర్శలు చేసిన అనంతరం ఇవాళ క్యాబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.
రాజ్ భవన్ లో కర్ణాటక గవర్నర్ వాజుభాయి వాలా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా డీకే శివకుమార్, బండెప్ప కాశంపూర్, హెచ్ డీ రేవణ్ణ, ఆర్వీ దేశ్పాండే, జీటీ దేవెగౌడ, కేజే జార్జ్ లతో పాటు బీఎస్పీ, కేజీపి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ మద్దతుతో ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీఎస్.. మంత్రివర్గ విస్తరణపై చాలా సమయం తీసుకుని.. చర్చోపచర్చలు జరిపిన అనంతరం ఇవాళ మంత్రివర్గ కూర్పుపై ఎట్టకేలకు తుది నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ నుంచి 14 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా, జేడీఎస్ నుంచి తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బీఎస్పీ, కేపీజేపి నుంచి చెరో ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బీఎస్సీ నుంచి మహేష్, కర్ణాటక ప్రజా జనతా పక్ష పార్టీ నుంచి శంకర్ లు ప్రమాణస్వీకారం చేశారు. ఇక మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారి పూర్తి జాబితా ఇదే..
1 D K శివకుమార్ కాంగ్రెస్
2 R V దేశ్పాండే కాంగ్రెస్
3 KJ జార్జ్ కాంగ్రెస్
4 కృష్ణ బైర్ గౌడ కాంగ్రెస్
5 రాజశేఖర్ పాటిల్ కాంగ్రెస్
6 శివానంద్ పాటిల్ కాంగ్రెస్
7 ప్రియాంకా ఖార్గే కాంగ్రెస్
8 U T ఖదర్ కాంగ్రెస్
9 జామిర్ అహ్మద్ ఖాన్ కాంగ్రెస్
10 పుట్టరంగా షెట్టి కాంగ్రెస్
11 శివశంకర రెడ్డి కాంగ్రెస్
12 జయమల కాంగ్రెస్
13 రమేష్ జార్కిహోలీ కాంగ్రెస్
14 వెంకటరామనప్ప కాంగ్రెస్
15 H D రెవణ్ణ జెడి (ఎస్)
16 G T దేవేగౌడ జెడి (ఎస్)
17 బంధపా కాశంపూర్ జెడి (ఎస్)
18 సి ఎస్ పుతరాజు జెడి (ఎస్)
19 వెంకటరావు నాదగౌడ జెడి (ఎస్)
20 SA RA మహేష్ జెడి (ఎస్)
21 DC తమన్నా జెడి (ఎస్)
22 MC మనాగులి జెడి (ఎస్)
23 SR శ్రీనివాస్ జెడి (ఎస్)
24 R శంకర్ కేపీజేపి
25 మహేష్ బిఎస్పి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more