బాలీవుడ్ నిన్నటి తరం నటి షబానా అజ్మీ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు ఆ శాఖ మంత్రిని కూడా క్షమాపణలు కోరింది. తాను చేసిన పోరబాటును వివరించినందుకు ధన్యవాధాలు కూడా తెలిపింది. ఆనక తనను సరిచేసినందుకు క్షమాపణలు కోరింది. ఇంటకీ విషయం ఏంటీ అంటారా.? సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఓ వీడియోను చూసిన సీనియర్ నటి షబానా అజ్మీ.. అంతకుముందు నెట్ జనుల కామెంట్లు చూసి మోసపోయింది. తాను కూడా అదే భావనతో ఆ వీడియోను ప్రజా, ప్రయాణిక సంక్షేమం కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రికి ఫార్వడ్ చేసింది.
రైల్వే మంత్రిత్వ శాఖ దానిపై వివరణ ఇవ్వడంతో అమె తన తప్పును తెలుసుకుని క్షమాపణలు చెప్పారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందయ్యా అంటే. ఇద్దరు వ్యక్తులు.. మురికి నీటిలో భోజనం తినే ప్లేట్లను కడుగుతున్న 30 సెకన్ల వీడియోను చూసిన షబానా.. వారిని రైల్వే సిబ్బందిగా భావించారు. తనకన్నా ముందు దానిని తనకు ట్వీట్ చేసిన వారు కూడా అలాగే భావించడంతో అమెకూడా అది రైల్వేలో జరిగిందని భావించారు. దాంతో వెంటనే ఆ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ, మంత్రి పీయూష్ గోయల్‌కు ట్యాగ్ చేసి.. ‘ఈ వీడియోను మీరొకసారి వీక్షించాల్సిందే’ అంటూ ట్వీట్ చేశారు.
షబానా ట్వీట్‌కు స్పందించిన రైల్వే శాఖ.. ‘మేడమ్ ఈ వీడియో ఒక మలేషియన్ రెస్టారెంట్లో.. మురికి నీళ్లలో ప్లేట్లను కడుగుతున్న వర్కర్లకు సంబంధించినదంటూ’.. అందుకు సంబంధించిన వార్తా కథనాన్ని కూడా ట్విటర్లో పోస్ట్ చేశారు. వెంటనే స్పందించిన షబానా.. ‘నా క్షమాపణలు స్వీకరించండి. పొరపాటును సరిదిద్దుకున్నానంటూ’ క్షమాణలు తెలిపారు. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కొందరు నెటిజన్లు... రైల్వే శాఖ షబానాపై పరువు నష్టం దావా వేయాలంటూ ట్రోల్ చేశారు. దీంతో మరోసారి ఆమె.. ‘మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానంటూ’ ట్వీట్ చేశారు.
https://t.co/qzDWMwJ0yi @PiyushGoyal Indian Railways pls watch
— Azmi Shabana (@AzmiShabana) June 5, 2018
Thank you for clarifying this . I stand corrected. Pls accept my apologies https://t.co/30Kodpcqfm
— Azmi Shabana (@AzmiShabana) June 5, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more