భారతీయులు తమ వంతు పన్నులను నిజాయితీగా చెల్లించాలని కోరిన కేంద్ర అర్థికశాఖమంత్రి అరుణ్ జైట్లీ.. వారు నిజాయతీగా పన్నులు చెల్లించకపోవడం వల్లే ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయని ప్రజల నిజాయితీని శంఖించేవిధంగా చేసిన వ్యాఖ్యలపై అటు విపక్షాలు ఇటు నెట్ జనులు మండిపడుతున్నారు. ఇంధన ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సక్రమంగా పన్నులు కడితే ఇంధన ధరలు వాటంతట అవే దిగివస్తాయని చెప్పారు.
ప్రజా పన్నులు సక్రమంగా వసూళ్లు కాకపోవడం వల్లే ఆదాయం కోసం పెట్రోలు, డీజెల్ తదితరాలపై భారీగా పన్నులు వేయాల్సి వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వేతనజీవులు మాత్రమే సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నారని, మిగతా అన్ని వర్గాల వారూ నిజాయతీగా పన్ను కట్టడం లేదని ఆరోపించిన ఆయన, ప్రజలు ఎప్పుడైతే పన్నులను సక్రమంగా చెల్లిస్తారో, అప్పటి నుంచి పెట్రోలు రేట్లు దిగివస్తాయని అన్నారు. 'పెట్రో' ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించే పరిస్థితి లేదని చెబుతూ, తన ఫేస్ బుక్ పేజీలో జైట్లీ ఓ వ్యాసాన్ని రాశారు.
మాజీ ఆర్థికమంత్రి చిదంబరం చెప్పే మాటలు వింటే.. దేశ అర్థిక పరిస్థితికి విఘాతం కలిగి చివరికి చేతిలో చిప్ప మిగులుతుందని విమర్శించారు. ఇంధన ధరలను లీటరుకు రూ. 25కు తగ్గిస్తే, భారతావని అప్పుల్లో కూరుకుపోతుందని అన్నారు. కాంగ్రెస్ వారు తాము చేసిన తప్పులను ఇప్పుడు ఎన్డీయేతో కూడా చేయించాలని చూస్తున్నారని ఆరోపించిన జైట్లీ, పెట్రోల్, డీజెల్ పై ఒక్క రూపాయి వ్యాట్ తగ్గించినా, కేంద్రంపై రూ. 13 వేల కోట్ల భారం పడుతుందని, సంక్షేమానికి నిధులు తగ్గుతాయని అన్నారు. అయితే గత నాలుగేళ్లుగా భారత అర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగవుతుందని అన్నారు.
కాగా, అరుణ్ జైట్లీ వాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. గడచిన నాలుగేళ్లుగా భారత అర్థిక పురోగతి సన్నగిల్లిందని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ వ్యాఖ్యానించారు. నాలుగేళ్లకు ముందు పదేళ్లుగా అధికారంలో వున్న తమ యూపీఏ ప్రభుత్వం.. ప్రజలపై భారం పడకుండా పటిష్టమైన అర్థిక విధానాలను అవలంభించి.. ఎన్డీయే ప్రభుత్వానికి అప్పగించిందని ఆయన అన్నారు. అయితే గత నాలుగేళ్లుగా భారత అర్థిక వ్యవస్థ పురోగతి దిగజారిందని మనీష్ తివారీ విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more