37 year old land row haunts Siddaramaiah ‘‘మాజీ సీఎం సహా నలుగురిపై కేసు నమోదు చేయండీ’’

Book siddaramaiah in alleged land scam court tells police

Siddaramaiah, Mysuru, Land Grabbing, N Gangaraju, former Karnataka CM, Mysuru, Lakshmipuram station, MUDA President, C Basevegowda, Druva Kumar, MUDA Commissioner, PS Kantharaju, land encroachment, Principal Senior Civil Judge, mysuru

An alleged property irregularity dating back to 1982, which pertains to a piece of land purchased by former CM Siddaramaiah in 1997 and sold in 2003, has now emerged as a headache for Mr Siddaramaiah.

‘‘మాజీ సీఎం సహా నలుగురిపై కేసు నమోదు చేయండీ’’

Posted: 06/19/2018 10:54 AM IST
Book siddaramaiah in alleged land scam court tells police

ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని ఇంటిని నిర్మించుకున్న కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదైంది. మైసూరు పరిధిలోని లక్ష్మీపురం పోలీసులు సిద్దరామయ్య సహా మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. మైసూరు రెండో సెషన్స్ కోర్టు ప్రిన్సిఫల్ సీనియర్ సివిల్ జడ్జి జారీ చేసిన అదేశాల మేరకు సీఎంతోపాటు మరో ముగ్గురిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. దాదాపుగా 37 ఏళ్ల క్రితం భూవివాదానికి సంబంధించిన కేసు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఇప్పుడు వెంటాడుతుంది.

మరోమారు ముఖ్యమంత్రి అవుతానన్న ధీమాతో.. బీజేపి సహా ప్రత్యర్థి పార్టీలను తక్కువగా అంచనా వేసిన ఆయన.. అధికారాన్ని జారవిడుచుకుని కూటమి ప్రభుత్వంలో పెద్దగా కొనసాగుతున్నారు. అయితే సరిగ్గా సీఎం పదవిని విడచిన నెల రోజుల వ్యవధిలోనే 37 ఏళ్ల నాటి పాత కేసు ఆయనను వెంటాడటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కర్నాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఆయన ప్రభుత్వభూమిని అక్రమించుకుని ఇల్లు కట్టుకున్నారన్న అభియోగంపై ఇప్పుడు కేసు నమోదైంది.

ఈ మేరకు మైసూరుకు చెందిన అర్టీఐ కార్యకర్త ఎన్. గంగరాజు న్యాయస్థానాన్ని అశ్రయించగా, న్యాయస్థానం అదేశాల మేరకు లక్ష్మీపురం పోలీసులు సిద్దరామయ్యపై తాజాగా పోలీసు కేసు నమోదు చేశారు. సిద్దరామయ్యతో పాటు అప్పటి మైసూరు పట్టణ అభివృద్ది సంస్థ అధ్యక్షుడు బసెవెగౌడ, ప్రస్తుత అధ్యక్షుడు ధృవకుమార్, కమీషనర్ పీఎస్ కాంతరాజులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. సిద్దరామయ్య తనకు కేటాయించిన 103 ఫీట్ల స్థలం బదులుగా 120 ఫీట్ల స్థలంలో ఇంటిని నిర్మించుకున్నారని మిగిలిన 17 ఫీట్ల స్థలాన్ని అక్రమించుకున్నారని అర్టీఐ కార్యకర్త తన పిటీషన్ లో పేర్కోన్నారు.

ఆ తర్వాత ఆ ఇంటిని సిద్ధరామయ్య విక్రయించారని కూడా పేర్కొన్నారు. దీంతో స్పందించిన కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తాను సీఎంపై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఏప్రిల్ మాసంలోనే గవర్నర్ ను కలిసానని.. అయితే గవర్నర్ అనుమతి అవసరం లేదని.. నేరుగా న్యాయస్థానాన్ని అశ్రయించి కేసు నమోదు చేయవచ్చునని తెలిపారని, ఈ క్రమంలో ఈ నెల 4న తాను న్యాయస్థానాన్ని అశ్రయించి పిటీషన్ దాఖలు చేశానని, కాగా కోర్టు 6న ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా అదేశాలు జారీ చేసిందని గంగరాజు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddaramaiah  Mysuru court  Land Grabbing  N Gangaraju  RTI Activist  lakshmipuram police  crime  

Other Articles