తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో అనేక వివాదాలకు కేంద్రబింధువుగా మారిని జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ మెదటికి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ సమయంలో వున్న 10 జిల్లాలను పునర్విభజన చేసి.. 31 జిల్లాలుగా రూపోందించిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని విషయంలో కొద్దిగా చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందా.? అంటే అవుననే సందేహాలే వస్తున్నాయి. ఇందుకు మూలకారణం.. తెలంగాణ సర్కారు పంపిన జిల్లాలను కేంద్రం అర్థభాగం మేర మాత్రమే అమోదించింది. మొత్తంగా 31 జిల్లాలలో కేవలం 17 జిల్లాలను మాత్రమే కేంద్రం అమోదించింది.
గతంలో ప్రకటించిన డీఎస్పీ, సహా పలు ఉద్యోగ ప్రకటనలకు ఈ అంశం ముడిపడి వుండటం.. ఇప్పటికే కేంద్రం ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయ వేసిన నేపథ్యంలో జిల్లాల పునర్విభజనపై కేంద్రం చేత ముద్ర వేయించి అటు పిమ్మట రాష్ట్రపతితో కూడా రాజముద్ర వేయించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అశలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నీళ్లు చల్లింది. రాష్ట్రంలో లోకసభ స్థానాలు 17 వున్న నేపథ్యంలో కేవలం 17 జిల్లాలను మాత్రమే అమోదిస్తామని, అంతకుమించి అమోదించలేమని స్పష్టం చేసింది.
రాష్ట్ర విభజన తరువాత వున్న అప్పటి 10 జిల్లాలు.. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గోండ, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వరంగల్ లకు అదనంగా మరో ఏఢు జిల్లాలను కేంద్ర ప్రభుత్వం అధికారికింగా అమోదించింది. అవి మంచిర్యాల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, నగర్ కర్నూల్ జిల్లాలు. దీంతో 2016 తరువాత జిల్లాలుగా ఏర్పడిన మరో 14 జిల్లాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ 14 జిల్లాలను అమోదం పొందిన 17 జిల్లాల్లో విలీనం చేయాలని అదేశించింది.
ఇప్పటికే జిల్లా హోదాను పోంది గత ఏఢాదిన్నరగా పాలన సాగిస్తున్న జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల, కుమరంభీమ్ అసిఫాబాద్, మహబూబాబాద్, మేడ్చల్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, స్యూరాపెట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ అర్భన్ జిల్లాలను ఎటు విలీనం చేస్తారన్న అంశం మళ్లీ తెలంగాణవాసులను కలవరానికి గురిచేస్తుంది. కాగా ఇక జిల్లాల పునర్విభజనతో ఉద్యోగ జోన్లును కూడా రమారమి ఖారారు చేసిన తెలంగాణ సర్కారు మళ్లీ మొత్తం ప్రక్రియను చేపట్టాల్సి వుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more