Actress's mobile robbed on road in Anna Nagar అన్నానగర్లో హీరోయిన్ కు ఛేదు అనుభవం..

Kollywood heroine s mobile robbed on road in anna nagar

Chennai, Sanjana, actor’s mobile robbed on road in Anna Nagar, sanjana singh, heroine, mobile phone, anna nagar, google map, renigunta, ko, anjaan, thani oruvan, chennai, tamil nadu, crime

Actor Sanjana Singh was robbed of her mobile phone when she was cycling near the Chinthamani signal in Anna Nagar of Tamil Nadu.

అన్నానగర్లో హీరోయిన్ కు ఛేదు అనుభవం..

Posted: 06/25/2018 12:50 PM IST
Kollywood heroine s mobile robbed on road in anna nagar

పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా దగా అన్న శ్రీశ్రీ వ్యాఖ్యలు ఇప్పుడా నటికి గుర్తుకు వచ్చినట్లు వున్నాయి. అదమరచినా.. ఏమరపాటుగా వున్నా.. మనకు తెలియకుండానే మన వస్తువులను కొట్టేస్తారు దొంగలు అన్న విషయం అమెకు ఇప్పుడు అర్థమైంది. అరోగ్యం కోసం సైక్లింగ్ చేద్దామని భావించి.. అన్నానగర్ లో కనిపించిన రోడ్డుపై వెళ్లి.. కన్సూజ్ అయిన నటి.. దారి తప్పామా అంటూ రోడ్డుపైన తన ఫోన్ తీసి గూగుల్ మ్యాప్ చూస్తుండగా అమెకు ఛేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన పెరంబూరు సమీపంలో జరిగింది.

అసలేం జరిగిందంటే.. రోజు ఉదయాన్నే సైక్లింగ్ చేయడం కాలీవుడ్ నటికి సంజనా సింగ్ కు అలావాటు. రోజు మాదిరిగానే అమె ఉదయం 6 గంటల సమయంలో ముగపేర్ నుంచి అన్నా నగర్ లోని తన సోదరి ఇంటికి సైకిల్ పై వెళ్లి వస్తున్న వేళ ఎక్కువ దూరం సైక్లింగ్ చేసింది. ఆ సమయంలో ఎటు వెళ్లాలో తెలియక సెల్ ఫోన్ లో చూసుకుంటూ నెమ్మదిగా వస్తుండగా, చింతామణి సిగ్నల్ సమీపంలో ఓ ద్విచక్ర వాహనంపైన వచ్చిన అగంతకుడు అమె చేతిలోని సెల్ ఫోన్ లాక్కుని వెళ్లిపోయాడు. జరిగిన పరిణామంలో ఒక్కసారి షాక్ కు గురైంది సంజన.

వెంటనే తేరుకుని దొంగను వెంబడించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇక అమె వ్యక్తిగత సహాయకుడు కూడా చాలా దూరం పరిగెత్తి ప్రయాపడినా ఫలితం దక్కలేదు. దొంగ తన వాహనాన్ని వేగంగా నడుపుకుంటూ తప్పించుకున్నాడని ఆమె అన్నానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దోంగను పట్టుకునేందుకు స్థానికంగా వున్న సీసీటీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నామని.. అగంతకుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sanjana singh  heroine  mobile phone  anna nagar  google map  chennai  tamil nadu  crime  

Other Articles