మీరు సినీప్రియులా.. షాపింగ్ ప్రేమికులా.. అయితే ఇది మీకు నిజంగా గుడ్ న్యూస్.. ఏంటదీ.. అంటారా.? మల్టీఫ్లెక్స్ ధియేటర్లకు బయట నుంచి ఆహార పదార్థాలు తీసుకెళ్లవచ్చునని.. ఇకపై బయటి అహారాన్ని మాల్స్, ధియేటర్లు అడ్డుకోరాదని అదేశాలు వెళ్లాయి. ఔనా..! నిజమేనా.? అంటున్నారా.. నిజమేనండీ అగస్టు మాసం నుంచి ఈ నిబంధనలు వర్తించనున్నాయి. అగస్టు తరువాత ఇక ఏ మల్టీఫ్లెక్సులోకి వెళ్లినా.. ఏ ధియేటర్లోకి సినిమాకెళ్లినా బయటనుంచి అహారాన్ని ముందుగానే కొని తీసుకెళ్లే అవకాశం వుంది.
హమ్మయ్యా.. అంటున్నారా.? కేవలం 50 రూపాయల ఖరీదు కూడా చేయని పాప్ కాన్ లకు 350 రూపాయల ధర పెట్టడం.. మల్టీఫ్లెక్సులు, థియేటర్లలోని ధరలకు ఇదే ప్రత్యామ్నాయం కావడంతో ఈ ధిశగా ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. అయితే ఏ ప్రభుత్వం మేము వినలేదుగా.. అంటారా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కాదు.. ఈ అదేశాలను జారీ చేసింది మహారాష్ట్ర సర్కారు. అవును అక్కడి ప్రభుత్వం మల్టీఫ్లెక్సులు, మాల్స్ కు ఆదేశాలు జారీ చేసింది. మాల్స్ కూడా అనుమతించాలంటూ మహారాష్ట్ర సివిల్ సప్లయ్ మినిస్టర్ రవీంద్ర చవాన్ ప్రకటించారు.
ఇటీవల మహారాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. సినిమా హాల్స్, మల్టీఫ్లెక్సుల్లో ఆహార పదార్థాల ధరలు ఆకాశంలో ఉన్నాయని.. 50 రూపాయల విలువ చేయని పాప్ కార్న్ ఏకంగా 350 రూపాయలు వసూలు చేస్తున్నారని.. బయట 20 రూపాయల కూల్ డ్రింక్.. అక్కడ 150 రూపాయలు వసూలు చేస్తున్నారని ఉద్యమం చేపట్టింది. దీనికితోడు బాంబే హైకోర్టులో పిటీషన్లు వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బయట ఫుడ్ ఎందుకు మాల్స్, సినిమా హాల్స్ లోకి తీసుకెళ్లకూడదో చెప్పాలని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది.
అదే విధంగా ఎందుకు ధరలను నియంత్రించలేకపోతున్నారని నిలదీసింది. సినిమా హాల్స్, మల్టీ ఫ్లెక్సుల్లో ఇతర ఆహార పదార్థాలను అనుమతి ఇవ్వకపోవటం వల్ల.. ధరలు అధికంగా ఉంటున్నాయన్న ప్రభుత్వ సమాధానంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆహార పదార్థాలను ప్రేక్షకులు బయటి నుంచి తెచ్చుకున్నా.. అనుమతించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. అదే విధంగా ధరలను భారీగా తగ్గించకపోతే ఆయా మల్టీఫ్లెక్సులపై చర్యలు కఠినంగా ఉంటాయని.. దీనిపై ఓ విధివిధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించింది కోర్టు. దీంతో ధరల అరాచకానికి చెక్ పడుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more