తన భర్త ఓ కాలేజీ విద్యార్థినితో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడని, అమెను పెళ్లి కూడా చేసుకున్నాడని, ప్రజలందరూ విశ్వసిస్తున్నట్లు తన భర్త మంచోడు మాత్రం కాదని.. కర్కోటకుడని జమ్మూకాశ్మీర్ కు చెందిన ఓ ఎమ్మెల్యే భార్య.. స్వతహాగా బీజేపి మహిళా విభాగం నేతైన మోనికా భగత్ అరోపించారు. తనకు విడాకులు ఇవ్వకుండానే ఆయన మరో అమ్మాయిని ఎలా వివాహం చేసుకుంటాడని అమె నిలదీశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీకి కూడా అమె లేఖ రాస్తూ.. తనకు న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు.
ఆర్ఎస్ పుర నియోజకవర్గ ఎమ్మెల్యే గగన్ భగత్.. పంజాబ్ కు చెందిన 19 ఏళ్ల ఓ యువతితో వివాహేతర సంబంధం నడుపుతున్నారని జమ్ము బీజేపీ మహిళా విభాగానికి కార్యదర్శి.. ఆయన భార్య మోనికా శర్మ ఆరోపించారు. ‘నా భర్త మంచోడు కాదు. గత కొంతకాలంగా ఓ కాలేజీ యువతితో అక్రమ సంబంధం నడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆ అమ్మాయిని రహస్య వివాహం కూడా చేసుకున్నారు. ఇంతకాలం సాక్ష్యాలు లేక ఆగిపోయా. ఇప్పుడు ఈ ఆధారాలతో(ఫోటోలు) మీ ముందుకు వచ్చా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. మీ బిడ్డకు జరుగుతున్న అన్యాయమనుకుని న్యాయం చేయండి’ అని ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాలను అమె అభ్యర్థించారు.
ఇటీవల తాను పంజాబ్ యువతి ఇంటికి వెళ్లి.. అమెకు నచ్చజెప్పుదామని, నా సంసారంలో చిచ్చు పెట్టోదని కొరుదామని వెళ్లా.. అయితే అమె నన్ను చూసి చూడగానే ఇంట్లోంచి పరారయ్యింది. అయితే వెళ్లే క్రమంలో అమె మొబైల్ ఫోన్ కూడా అక్కడే వదిలేసి వెళ్లింది. దానిని పరిశీలించగా తన అరోపణలకు బలం చేకూరిందని, వారిద్దరూ వివాహం చేసుకున్నారని మోనిక అరోపించారు. వారిద్దరూ సన్నిహితంగా వున్న ఫోటోలు కూడా ఫోన్ లో వున్నాయని వాటిని కూడా తాను బీజేపి కమిటీ పెద్దలకు అప్పగించానని అన్నారు.
పంజాబ్ యువతి తాత అధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించడంతో.. దిగివచ్చిన బీజేపి అధిష్టానం.. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే కమిటీ ఎదుట వేర్వేరుగా హజరైన మోనికా, గగన్ లు వారి వారి వాదనలు వినిపించారు. అనంతరం బయటకు వచ్చిన గగన్.. తన భార్య మోనికా ఆరోపణలను తోసిపుచ్చారు. ‘మా మధ్య కొంతకాలంగా మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆమె విడాకులు కోరింది. పిల్లల భవిష్యత్ దృష్ట్యా వద్దని వారించా. ప్రస్తుతం కౌన్సిలింగ్ జరుగుతోంది. అందుకే ఈ ఆరోపణలు’ అని గగన్ చెబుతున్నారు.
అయితే కౌన్సిలింగ్ జరుగుతున్న మాట వాస్తవమేనని, కానీ, చెల్లించాల్సిన భరణం కూడా గగన్ ఇవ్వట్లేదని మోనికా చెబుతున్నారు. న్యాయస్థానంలో ఒప్పందం మేరకు ప్రతి నెల లక్ష రూపాయల భరణం ఇస్తామని చెప్పిన గగన్.. వాటిని కూడా సరిగా చెల్లించడం లేదని మోనికా అరోపించారు. మరోవైపు గత నెల చివర్లో తన కూతురిని గగన్ అపహరించాడంటూ యువతి తంత్రి పంజాబ్ కు చెందిన మాజీ సైనికాధికారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు యువతిని రక్షించిన పోలీసులు మీడియా ముందుకు అమెను తీసుకురాగా, గగన్ చాలా మంచోడు అని యువతి కితాబివ్వడం కొసమెరుపు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more