మీరు శ్రీవారి భక్తులా..? ప్రతీ ఏడాది తిరుమలకు వచ్చి ఆ దేవదేవుడిని దర్శించుకుని వెళ్తుంటారా.? అయితే ఈ సారి కూడా మీ టికెట్లు ముందగానే రిజర్వు చేసుకున్నారా.? అయితే ఒక్కక్షణం ఆగండీ ఈ న్యూస్ మీ కోసమే. ప్రతిరోజు లక్ష మంది భక్తులతో పాటు అలయ అర్చకులకు, వేదపండితులకు, ప్రముఖులకు ఇలా అందరికీ అశీర్వాదాలు అందజేస్తున్న కలియుగ ప్రత్యక్ష దైవం.. శ్రీ వేంకటేశ్వరుడికి విరామాన్ని ప్రకటించారు ఆలయ పాలక మండలి సభ్యులు. అదేంటి విచిత్రంగా మాట్లాడుతున్నారు.? అంటారా.?
తిరుమల శ్రీవారి దర్శనాన్ని తొమ్మిది రోజుల పాటు ఆలయ అధికారులు నిలిపివేస్తున్నారు. తిరుమల కొండపైకి ఎవరినీ రానీయకుండా కూడా చర్యలు తీసుకోనున్నామని కమిటీ అధికారులు ప్రకటించారు. తిరుమల కొండపైకి అర్టీసీ బస్సులు కూడా రానీయమని, భక్తులు అనేక వ్యవప్రయాలకోర్చి.. తిరుపతికి చేరుకుని ఉసూరుమంటూ వెనుదిరగాల్సి రావడం.. ఇక్కడ ఇబ్బందులకు గురవ్వడం ఇష్టంలేకపోవడంతోనే తాము ఏకంగా నెల రోజుల ముందుగా ఈ సమాచారాన్ని భక్తులకు చేరవేస్తున్నామని అన్నారు. ఒక వేళ ఎవరైనా తిరుమల దర్శనానికి టికెట్లు రిజర్వు చేసుకుని వుంటే వాటిని వెంటనే రద్దు చేసుకోవడమే లేక 16 తరువాత తేదీలకు వాయిదా వేసుకోడమే మంచిదని అధికారులు స్పష్టం చేశారు.
ఎందుకిలా అంటే.. తిరుమల శ్రీవారికి ప్రతీ 12 ఏళ్లకు ఓ పర్యాయం అష్ట బంధన బాలాలయ మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు. 2006లో జరిగిన మహాసంప్రోక్షణ తరువాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ అగస్టు మాసంలో మహాసంప్రోక్షణ నిర్వహించనున్నారు. దీంతో ఆగస్టులో తొమ్మిది రోజుల పాటు భక్తులను కొండపైకి రానీయకుండా సంప్రోక్షణ కార్యక్రమాలకు విఘాతం కలగకుండా కార్యాలను పూర్తి చేయాలని తాము భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకుగాను ఆగస్టు నెల 9వ రోజు సాయంత్రం నుంచి 16వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అలయం మూసివేస్తామని ప్రకటించారు. 11వ తేదీ నుంచి సంప్రోక్షణ కార్యాక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఇదే సమయంలో ఘాట్ రోడ్డు, నడకదారిని కూడా బంద్ చేయనున్నారు. ఆగస్టు 17 నుంచి యథావిధిగా స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more