first-ever dalit baraat in UP in Independent India వీడు సామాన్యుడు కాదు.. భరాత్ లో 350 మంది పోలీసులు..

Dalit groom takes out wedding procession in up s kasganj

first-ever Dalit baraat, Dalit wedding, wedding procession, baraat, Groom, UP, Sanjay Jatav, Sheetal Kumari, Police Inspector, Head Constable, Nizampur, Kasganj, Uttar Pradesh, politics

The administration fortified the area around his bride’s village, deploying 10 police inspectors, 22 sub-inspectors, 35 head constables, 100 constables and a platoon of the state provincial armed constabulary.

వీడు సామాన్యుడు కాదు.. బరాత్ లో 350 మంది పోలీసులు..

Posted: 07/16/2018 03:23 PM IST
Dalit groom takes out wedding procession in up s kasganj

యూపీలోని నిజామ్‌పూర్ గ్రామం గత ఆరు నెలలుగా వార్తలో నిలుస్తోంది. కసగంజ్ జిల్లాలోని ఈ గ్రామంలోని ఓ దళితుడి వివాహానికి ఉన్నత వర్గానికి చెందిన ఠాకూర్లు తీవ్ర అంతరాయం కలిగించడమే దీనికి కారణం. అయితే అతడి వివాహాన్ని 350 మంది పోలీసులు దగ్గరుండి మరీ ఆదివారం జరిపించారు. ఠాకూర్లు నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించడంతో దళిత యువకుడు సంజయ్ జాతవ్ వివాహం ఘనంగా జరిగింది. పక్క జిల్లా హత్రాస్ నుంచి వచ్చిన వరుడు సంజయ్‌ను ఆదివారం మధ్యాహ్నం ఒక గుర్రపు బండిలో ఊరేగించారు. ఓ సాధారణ వ్యక్తి వివాహానికి అంత మంది పోలీసుల భద్రత కల్పించడంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది. న్యూస్ ఛానెళ్ల దీనిపై కథనాలు ప్రచురించాయి.

ఈ సందర్భంగా వరుడు సంజయ్ మాట్లాడుతూ.. తాము సమానత్వాన్ని, గౌరవాన్ని మాత్రమే కోరుకుంటున్నామని, నేను గానీ, మా సామాజిక వర్గం గానీ ఠాకూర్లకు వ్యతిరేకం కాదు.. కానీ కులం పేరుతో వివక్షతకు పాల్పడటాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నాడు. మరోవైపు వధువు షీతల్ సింగ్ ఆనందానికి అవధుల్లేవు. ‘దళితులను అణిచివేసేందుకు ఠాకూర్లు తీసుకొచ్చిన పురాతన సంప్రదాయాన్ని మార్చేందుకు నా భర్త చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది.. గత నలభై ఏళ్లుగా నిజామ్‌పూర్‌లో దళితుల వివాహసమయంలో ఊరేగింపు జరిపితే అగ్రవర్ణాలు దాడులకు పాల్పడుతున్నారు.. ప్రస్తుతం మా పెళ్లితో దీనికి అడ్డుకట్టపడింది’ అని ఆమె వ్యాఖ్యానించారు.

కసగంజ్, హత్రాస్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న నిజామ్‌పూర్ గ్రామంలో ఆరు పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు, పీఏసీకి చెందిన జవాన్లు మొత్తం 350 మంది, ఓ ఏఎస్పీ, ఇద్దరు సీఐలు ఈ భద్రతను పర్యవేక్షించారు. ఊరేగింపు జరిగే మార్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాయుధ పోలీసులను మొహరించారు. జిల్లా ఉన్నతాధికారులు సైతం ఆదివారం ఉదయం నుంచి గ్రామంలో ఉండి పరిస్థితిని సమీక్షించడం గమనార్హం. స్థానిక నిఘా వర్గాల సమాచారంతో శనివారం నుంచే పోలీసులను మొహరించి, మండపం వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ఓ పెళ్లి కోసం ఇంతటి కట్టుదిట్టమైన భద్రత కల్పించడం ఎప్పుడూ చూడలేదని గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో అగ్రవర్ణాలు వారు తమ ఇళ్ల నుంచి బయటకు రాలేదు... కొందరు గ్రామం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీనిపై ఠాకూర్లు భిన్నంగా స్పందించారు. దళితుల ఊరేగింపు తమ గ్రామంలో సంప్రదాయానికి వ్యతిరేకమని, ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని గ్రామ పెద్ద కాంతి దేవి వ్యాఖ్యానించడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dalit wedding  wedding procession  baraat  Groom  Sanjay Jatav  Sheetal Kumari  Uttar Pradesh  politics  

Other Articles