Lok Sabha takes up no-confidence vote మెజారిటీ వున్నా.. మొరాలిటీ లేని ఎన్డీయే: గల్లా జయదేవ్

Lok sabha takes up no confidence vote bjd walks out

no trust vote, no confidence motion, BJD, Sumitra Mahajan, Bhartruhari Mahtab, bharat ane nenu, biju janata dal, congress, TDP, galla jayadev, kesineni nani, APSPS, special status, Andhra pradesh, NDA

TDP moves motion against the Modi government in Lok Sabha. MP Galla Jayadev says it is a war against the injustice meted out to the people of Andhra Pradesh, quoting It is not a war between TDP and Bharatiya Janata Party (BJP), but between morality and majority.

మెజారిటీ వున్నా.. మొరాలిటీ లేని ఎన్డీయే: గల్లా జయదేవ్

Posted: 07/20/2018 12:22 PM IST
Lok sabha takes up no confidence vote bjd walks out

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మాణం నేపథ్యంలో తీర్మాణమిచ్చిన ఎంపీ కేశినేని నానికి బదులు మరో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.. అవిశ్వాస తీర్మాణంపై చర్చను ప్రరారంభించారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ ను ప్రవేశపెట్టాలంటూ నానిని లోక్ సభ స్పీకర్ సుమిత్రామహాజన్ కోరడంతో ఆయన దాన్ని చదివి వినపించారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పై అవిశ్వాసాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అనంతరం చర్చను ప్రారంభించాల్సిందిగా టీడీపీ మరో ఎంపీ గల్లా జయదేవ్ ను స్పీకర్ కోరారు.

తొలిసారి పార్లమెంటు సభ్యుడైన తనకు ఈ అరుదైన అవకాశం దక్కడం.. ఒకింత సంతోషంగా వున్నా.. ఎన్డీయే ప్రభుత్వానికి మిత్రుడిగా వుండి బయటకువచ్చి ఈ బిల్లును ప్రవేశపెడుతున్నందుకు బాధగా వుందని ఆయన అవేధన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ అవిశ్వాస తీర్మాణానికి మద్దుతు పలికిన అప్, కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, లెప్ట్, ఎన్సీపీ, అర్జేడీ సహా పలు పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకిచ్చిన మాట, ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసాలను ప్రజలు ఎంతగా పెట్టకుంటారన్న విషయాలను స్పష్టం చేసిన భరత్ అనే నేను చిత్రం అంశాన్ని అక్కడ ప్రస్తావించారు.

మీ మాటలను మర్చిపోయారా.. ప్రధానిజీ

దీంతో పాటు గల్లా జయదేవ్.. ఎన్నికలకు ముందు రాష్ట్ర పర్యటనల సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ఊటంకిచ్చారు. తల్లిని చంపి పిల్లను బతికించారని ప్రధాని వ్యాఖ్యానించారని,. తాము అధికారంలోకి వస్తే త్లలిని కూడా బతికిస్తామని అన్నారని గల్లా అప్పటి మోదీ వ్యాఖ్యలను పార్లమెంటుకు తెలిపారు. తాము ప్రవేశపెడుతున్న అవిశ్వాసం కేంద్రంలోని అధికార బీజేపి ప్రభుత్వానికి, తమ టీడీపీ ప్రభుత్వానికి యుద్దం కాదని, ఇది మెజారిటీకి మొరాలికీకి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. ధర్మవ్యాఖ్యలు, ప్రవచనాలు చెప్పే ప్రభుత్వపెద్దలు.. ఒక రాష్ట్రాన్ని అదుకుంటామన్న చేతులతోనే అంధకారంలోకి నెట్టిన దారుణంపై జరుగుతున్న ధర్మయుద్దమని పేర్కోన్నారు.

ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఏ విధమైన హామీ నెరవేరలేదని, ఆయన ఇచ్చిన మాటను తప్పారని ఆరోపించారు. ఐదు కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన మాటను నరేంద్ర మోదీ నిలబెట్టుకోలేదని అన్నారు. ఇప్పుడు ఏపీ ఇష్యూ మొత్తం దేశానికే ఇష్యూగా మారిపోయిందని అన్నారు. ఇచ్చిన మాటను నిలుపులోలేని నరేంద్ర మోదీ పాలనపై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని  మండిపడ్డారు. అందుకే తమ రాష్ట్రంలో ధర్మపోరాటానికి ప్రజల నుంచి మంచి మద్దతు వస్తోందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన పారదర్శక సంబంధాలను మోదీ తీవ్రంగా దెబ్బతీశారని ఆరోపించారు.

బీజేపిపై అవిశ్వాసం అందుకే..

పారదర్శకత, నమ్మకం, ప్రాధాన్యత, మాట నిలబెట్టుకోవడం అన్న నాలుగు కారణాలతో తాము ఈ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టామని చెప్పిన ఆయన, తమకు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విశ్వాసం పోయిందని చెప్పారు. పారదర్శకంగా ఆంధ్రప్రదేశ్ ను విభజించని కాంగ్రెస్, రాష్ట్రానికి న్యాయం చేస్తామని చెప్పి మోసం చేసి.. ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్న బీజేపి రెండు జాతీయ పార్టీలు కలసి అంధ్రప్రదేశ్ ను అంత:పాతాళానికి నెట్టివేశాయని దుయ్యబట్టారు. నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వని కేంద్రంలోని అధికార బీజేపిపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో వున్నారని అన్నారు.

విభజన హామీలపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కేంద్రం విఫలమైందని తమ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల భావిస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఉన్న ఎన్నో విద్యాసంస్థలు, కేంద్ర సంస్థలు పాత పేరుతో కొత్తగా పుట్టిన ఆంధ్రప్రదేశ్ లో లేవని చెప్పారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ అపరాధం చేస్తే.. సాయం చేస్తానని హామినిచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తరువాత మాటను నిలబెట్టుకోకపోవడం బీజేపి చేసిన మహాపరాదమని గల్లా నిప్పులు చెరిగారు. విభజన తరువాత రాజధాని లేని, ఆదాయంలో లోటున్న రాష్ట్రానికి ఇదేనా మీరు చేసే సాయమని ప్రశ్నించారు.

ఫ్యాకేజీ నుంచి హోదా డిమాండ్ కు కారణమిదే..

దేశంలోని అన్ని వెనుకబడిన జిల్లాలకు నిదులిచ్చిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన జిల్లాకు కూడా నిధులను ఇచ్చి.. ప్రత్యేకంగా కేటాయించామని చెప్పడంతో బీజేపిపై నమ్మకం పోయిందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంతోనే బీజేపీని ఏపీ ప్రజలు ఆదరించారని, కానీ నాలుగేళ్లయినా కాలయాపన చేస్తూ, అశాస్త్రీయ కారణాలను చెబుతూ బీజేపీ విశ్వసనీయతను పోగొట్టుకుందని అన్నారు. అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేస్తూన్న తమకు అదనంగా నిధులిస్తామని చెప్పి.. ప్రత్యేక ప్యాకేజీని తెరపైకి తీసుకువచ్చారని అన్నారు. అయితే రాష్ట్రానికి చట్టప్రకారం రావాల్సిన నిధులనే కేటాయిస్తూ.. ప్యాకేజీ కింద కేటాయిస్తున్నామన్న మోసాన్ని గ్రహించి తాము మళ్లీ ప్రత్యేకహోదాను డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నది ఏపీ ప్రజలందరి అభిమతమని గల్లా జయదేవ్ చెప్పారు. 2014లో తెలుగుతల్లిని కాంగ్రెస్ పార్టీ రెండుగా చీల్చిందని అన్నారు. ఆపై ఎన్నికల సమయంలో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారానికి వచ్చి, కాంగ్రెస్ తల్లీ బిడ్డలను చంపిందని, తాము తల్లినీ, బిడ్డను కూడా బతికిస్తామని చెప్పినప్పుడు ఎంతో ఆనందం వేసిందని అన్నారు. అందుకే నాలుగేళ్ల పాటు మోదీ ఏదో చేస్తారని, తల్లిని రక్షిస్తారని వేచి చూశామని చెప్పారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తే బీహార్ వంటి రాష్ట్రాలు కూడా అదే విషయాన్ని డిమాండ్ చేస్తాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారని, ఇంతకన్నా అర్థరహితమైన కారణం మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు.

ప్రధాని మోడీ మోసగాడు: గల్లా జయదేవ్

ప్రధాని తిరుపతిలోని బాలాజీ సాక్షిగా, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజల సాక్షిగా హోదాను ఇస్తామని ప్రమాణాలు చేశారని, అదే సమయంలో "మీకు స్కీమాంధ్ర కావాలా? స్కామాంధ్ర కావాలా?" అని అడిగారని, చంద్రబాబు వంటి డైనమిక్ నేతను ఎన్నుకోవాలని ప్రజలకు చెప్పారని గుర్తు చేశారు. జరుగుతున్నదంతా ప్రజలు చూస్తున్నారని, బీజేపీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఇవి తన మాటలు కాదని, ఇటువంటి ప్రధానిని ఎందుకు ఎన్నుకున్నామా? అని ఎన్నో కోట్లమంది ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. ఈ సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేని మెసగాడిగా అభివర్ణించారు గల్లా జయదేవ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles