బిగ్‌బాస్ -11 తొ సెలబ్రిటీగా మారడంతో పాటు నటిగా కూడా అవకాశాలు సంపాదించుకున్న కంటెస్టెంట్ బంగ్డీ కల్రాపై కేసు నమోదైంది. బిగ్ బాస్ తో అమె సంపాదించిన ఫేమ్ ను తమ వాణిజ్య ప్రకటనలకు వినియోగించిన రెండు సంస్థలు అమెను తమ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకోవడం.. అందుకు అమె అంగీకరించడం.. ఫలితంగా అవి ఫేక్ సంస్థలని తేలడం.. సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వున్న కల్రాపై బాధితుడు పిర్యాదు చేయడం.. పోలీసులు అన్ని పరిశీలించన తరువాత అమెపై కేసును నమోదు చేయడం.. ఇదండీ సంగతీ.
తనకు ఫేక్ ఐఫోన్లు విక్రయించిందంటూ బెంగళూరులో నివసిస్తున్న ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి కల్రాతోపాటు ఢిల్లీకి డిఫరెంట్ కలెక్షన్, నెక్సాఫేషన్ డాట్ కామ్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరు శివారులోని మరథహళ్లికి చెందిన యువరాజ్ సింగ్ యాదవ్.. నటి కల్రా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను చూశాడు. అందులో రెండు కొత్త ఐఫోన్ ఎక్స్ మొబైళ్లు రూ.61 వేలకే అందుబాటులో ఉన్నట్టు ఉంది. ఇదేదో బాగానే ఉందని భావించిన యువరాజ్ సింగ్ పేటీఎం ద్వారా రూ.13 వేలు చెల్లించి వాటిని బుక్ చేసుకున్నాడు. తర్వాత తనకు పార్శిల్ రావడంతో మిగతా డబ్బులు చెల్లించి పార్శిల్ తీసుకున్నాడు. అనంతరం పార్శిల్ విప్పి చూడగా అందులో రెండు నకిలీ ఐఫోన్లు కనిపించాయి.
దీంతో నిశ్చేష్టుడైన యువరాజ్ సింగ్ వెంటనే నటికి, ఆయా సంస్థలకు ఫోన్ చేశాడు. అయితే, వారి నుంచి అతడికి స్పందన రాలేదు. తన అవేదనను వెలిబుచ్చుతూ మరథహళ్లి పోలీసులకు యువరాజ్ సింగ్ ఫిర్యాదు చేశాడు. కల్రాకు, బాధితుడికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కల్రా తన ఈమెయిల్ ఐడీతోపాటు పైన పేర్కొన్న రెండు సంస్థల ఈమెయిల్ ఐడీలను బాధితుడికి పంపింది. నటి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫేక్ కాదని తేలడంతో కల్రాతోపాటు రెండు సంస్థలను విచారించేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఢిల్లీ పంపినట్టు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more