అత్యాచారం కేసులో అధికార పార్టీ బీజేపికి చెందిన ఎమ్మెల్యేకు కూడా కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైన విషయాన్ని ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన నేతలు అప్పుడే మర్చిపోయినట్లు వున్నారు. అధికార పార్టీ మాది.. మేం ఏం చేసినా చెల్లుతుందన్న భావనలో వున్న ఓ నేత.. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి.. అమె పిర్యాదు నేపథ్యంలో తన డ్రైవర్ తో బలవంతపు వివాహం చేయించి.. తన పాపానికి ప్రాయశ్చిత్తం చేయించుకున్నానని భావిస్తున్నాడు. ఆయితే డ్రైవర్ కూడా ఆమెతో ఆరు నెలల పాటు సంసారం చేసి ఆనక వదిలివెళ్లిపోయాడు.
ఇది పథకం ప్రకారం తనపై అధికార పార్టీ బీజేపీకి చెందిన నేత, అతని డ్రైవర్ కలసి ఆడిన నాటకమని, తనపై అత్యాచారం జరిపిన ఇద్దరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత మహిళ పోలీసులను అశ్రయించి పిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే మీరట్ నేత బీజేపి నేత విక్కీ తనేజా, తన డ్రైవర్ జైబ్ తో కలసి తనపై అత్యాచారం చేశారని, కేసు నుంచి తప్పించుకునేందుకు తనకు ఇష్టం లేకపోయినా అతని డ్రైవర్ జైబ్ తో బలవంతంగా వివాహం జరిపించాడని బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది.
తనేజా తనపై ఏడాది క్రితం అత్యాచారం చేశాడని, దీంతో తాను పోలీసులను ఆశ్రయించానని చెప్పింది. అయితే పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చిన నేత.. రాజీ కుదుర్చుకుంటామని చెప్పి తనను తీసుకెళ్లి.. తన డ్రైవర్ జైబ్ తో ఆమెకు ఇష్టం లేని పెళ్లిని చేయించాడని తెలిపింది. అయితే వివాహం అనంతరం ఆరు నెలల పాటు బాధితురాలితో ఉన్న జైబ్, ఆపై ఆమెను వదిలేసి వెళ్లాడు. దీంతో ఆమె మరోసారి పోలీసులను ఆశ్రయించింది. అత్యాచార కేసుల్లో రాజీలు కుదరవని కచ్చితంగా వారిపై కేసులు నమోదు చేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశించిన నేపథ్యంలో.. తాము చెసిన తప్పు వెలుగులోకి వస్తుందని, పోలీసులు ఈ సారి విక్కీ తనేజా, జైబ్ లపై కేసు నమోదు చేశారు. కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more