స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గతానికి భిన్నంగా తనకు అత్యధిక మంది దేశప్రజలు సూచించిన అంశాన్ని తీసుకుని దానిపై అనర్ఘళంగా మాట్లాడేసి.. దేశప్రజలను గత నాలుగేళ్లుగా మంత్రముగ్దుల్ని చేస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ. అయితే గత నాలుగు పర్యాయాలకు ఈ పర్యాయానికి మాత్రం తేడా అప్పుడే కనిపించింది. నమో మంత్రంతో దేశమంతా సమ్మోహనమైన నాలుగేళ్ల క్రితం నుంచి.. నేటి పంద్రాగస్టు వచ్చే సరికి దేశప్రజల్లో కొంతమార్పు మాత్రం కనబడుతుంది.
ఈ సారి పంద్రాగస్టున ఐదో పర్యాయం ఎర్రకోట నుంచి ప్రసంగం చేయనున్న ప్రధాని.. గత నాలుగు పర్యాయాల మాదిరిగానే ఈ సారి కూడా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తాను ఏం మాట్లాడాలో చెప్పండి అంటూ ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరారు. ‘పంద్రాగస్టు ప్రసంగంలో నేను ఏం మాట్లాడాలనుకుంటున్నారు. మీ సలహాలు, సూచనలు నరేంద్రమోదీ యాప్ ద్వారా నాతో పంచుకోండి. మీ విలువైన అభిప్రాయాల కోసం నేను ఎదురుచూస్తుంటాను’ అని ప్రధాని మోదీ ఇవాళ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ఇవాళ ఉదయం మోదీ ఈ ట్వీట్ చేయగా.. కొద్ది సేపట్లోనే వందల కొద్ది కామెంట్లు వచ్చాయి. అయితే ఈ సారి వచ్చిన సలహాల్లో బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సంకటంగా పరిణమించిన నల్లధనం, మూకదాడులు, మహిళల రక్షణపై మాట్లాడాలని నెట్ జనులు ప్రధానికి సూచించారు. ఇక మరికోందరు కాలుష్య నియంత్రణపై మాట్లాడాలని సలహాఇచ్చారు. ప్రధాని ట్వీట్ చేసిన వెనువెంటనే నెట్ జనులు ఈ అంశాలపై మాట్లాడాలని కోరుతూ ఆయనకు యాప్. ట్విట్టర్ లో పోస్టు చేశారు.
‘ప్రధాని మోదీ జీ.. కాలుష్య నియంత్రణ గురించి మాట్లాడండి. ఇది మన దేశంలో పెద్ద సమస్యగా మారింది’, ‘నల్లధనం గురించి మాట్లాడండి’ అని, మూకదాడుల గురించి మాట్లాడండి’, ‘మహిళల రక్షణ గురించి మాట్లాడండి’ అని నమో యాప్, మోదీ వెబ్సైట్లలో కామెంట్లు పెడుతున్నారు. ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేయడం ఇది ఐదోసారి కావడంతో ఏ అంశాన్ని ఎంచుకుంటారన్న అసక్తి కూడా వుంది. అయితే కొందరుమాత్రం మోదీ హత్యకు కుట్ర అంశంపై మాట్లాడండీ అంటూ కొందరు.. ఛాయ్ వాలా పీఎం వద్దనుకున్న అంశంపై మాట్లాడాలని వినతలు వెల్లువెత్తుతున్నాయి.
What are your thoughts and ideas for my 15th August speech?
— Narendra Modi (@narendramodi) July 31, 2018
Share them with me on a specially created forum on the Narendra Modi App.
You can also share them on MyGov. https://t.co/BJMCEeisne
I look forward to receiving your fruitful inputs in the coming days.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more