Four of a family found buried in Kerala House కలకలం రేపుతున్న కుటుంబ హత్యలు..

Thodupuzha murders take spooky turn police probe black magic angle

mass murder in kerala, family murder in kerala, mass family murder in kerala, mass murder in Thodupuzha, family murder in Thodupuzha, mass family murder in Thodupuzha, Idukki mass murder, Idukki family murder, Idukki mass family murder, Four Member Family In Kerala, Thodupuzha Murder, Burari Family, Black Magic, crime

a four-member family in Kerala has been found dead under mysterious circumstances in Thodupuzha, Idukki. K Krishnan, his wife Susheela, daughter Arsha and son Arjun were found buried one over the other in a pit behind their house

కలకలం రేపుతున్న కుటుంబ హత్యలు.. గొయ్యి తీసి పూడ్చిన అగంతకులు

Posted: 08/02/2018 12:19 PM IST
Thodupuzha murders take spooky turn police probe black magic angle

ఓ కుటుంబాన్ని సామూహికంగా హత్య చేసిన పూడ్చిపెట్టిన ఘటన దేశవ్యాప్తంగా పెను కలకలాన్ని రేపుతుంది. సదరు కుటుంబంతో ఎవరికైనా.. ఏ రూపంలో శత్రుత్వం వున్నా.. కుటుంబంలోని అందరినీ ఒకే రోజు వారింట్లో హత్య చేయడం సంచలనం రేపుతుంది. కుటుంబంలోని నలుగురు సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం.. వారి మృతదేహాలపై బలమైన గాయాలు వుండటం పలు అనుమానాలకు తావిస్తుంది. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో తొడుపుజ ప్రాంతంలో జరిగిన ఈ దారుణం అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఓ కుటుంబంలోని భార్యభర్తలు, వారి కూతురు, కొడుకు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. వారిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఇంటి వెనుకే గొయ్యి తవ్వి నలుగురినీ ఒకరిపై ఒకరిని పెట్టి పూడ్చేశారు. ఇంట్లోని వ్యక్తులు రెండు మూడు రోజులుగా బయటకు రావడం లేదని గమనించిన పొరుగు వాళ్లు బుధవారం పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడడంతో విషయం బయటపడింది. ఇంట్లో అక్కడక్కడా రక్తపు మరకలు ఉన్నాయి. ఇంటి వెనుకకు వెళ్లగా ఓ చోట గొయ్యి తవ్వి పూడ్చేసినట్లు కనిపించింది. దీంతో ఆ ప్రాంతంలో తవ్వగా నలుగురి మృతదేహాలు బయటపడ్డాయి.

మృతులను కె.కృష్ణన్‌(52), ఆయన భార్య సుశీల(50), కుమార్తె అర్ష(21), కుమారుడు అర్జున్‌(20)లుగా గుర్తించారు. వారి శరీరాలపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో కత్తి, సుత్తెను స్వాధీనం చేసుకున్నారు. సుత్తెతో బలంగా కొట్టడం వల్ల వాళ్లు చనిపోయినట్లు తెలుస్తోందని చెప్పారు. ఆదివారం వీరిని చంపి పూడ్చి పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుటుంబానికి బాగా తెలిసిన వారే హత్యలకు పాల్పడి ఉంటారని, ఈ నేరంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నామని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు.

నలుగురు కుటుంబసభ్యులు మృతి చెందడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి మరణం వెనుక చేతబడి కారణమా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంట్లోని వాళ్లు ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడేవాళ్లు కాదని స్థానికులు పోలీసులకు చెప్పారు. కృష్ణన్ కు రబ్బర్‌ ప్లాంట్‌ ఉందని, అయితే ఆయన జ్యోతిష్కుడు అని, తాంత్రిక పూజలు చేస్తాడనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు. రాత్రిపూట పెద్ద పెద్ద కార్లలో చాలా మంది కృష్ణన్ వద్దకు వస్తుంటారని కూడా ఇరుగు పొరుగు వాళ్లు పోలీసులకు వెల్లడించారు. దీంతో చేతబడి చేశారనే అనుమానంతోనే ఎవరైనా కుటుంబం మొత్తాన్ని చంపేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mass murder  family murder  Idukki  thodupuzha  black magic  krishnan  kerala  crime  

Other Articles