ఆగస్టు 1 నుంచి ఇటు తెలంగాణ రాజధాని, అటు దేశ అర్థిక రాజధానిలోని ధియేటర్లు, మల్టీప్లెక్సుల్లో గరిష్ట చిల్లర ధరలకే తినుబండారాలను విక్రయించాలని, ప్రేక్షకులు యధేశ్చగా తమ అహారాన్ని బయటి నుంచి తీసుకువెళ్లవచ్చునన్న అదేశాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనలు గతంలోనూ సమైక్యరాష్ట్రంలో వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పడు ఎలా ఈ అదేశాలను తుంగలోకి తొక్కి మళ్లీ తమ పాతపద్దతి ద్వారా ప్రేక్షకుల జేబులకు కన్నం వేసిన థియేటర్, మల్టీఫ్లెక్సుల యజమాన్యాలు.. ఆగస్టు ఒకటవ తేదీన కూడా అదే పంథాను అమలుపర్చాయి.
ఫ్యాకేజీ ఫుడ్ ను మాత్రమే ఎంఆర్పీ ధరలకు అమ్మాలన్న నిబంధనల నేపథ్యంలో అనేక ధియేటర్లలో ఫ్యాకేజీ లేని.. గరిష్ట చిల్లర ధర లేని తినుబండారాలు, పానీయాలు విక్రయించారు. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను తొలి రోజే బేఖాతరు చేస్తూ తామున్నది దోచుకునేందుకనే మరోమారు చాటారు. పలు టీవీ చానళ్లు నిన్న మాల్స్ పై నిఘా పెట్టి, రహస్య కెమెరాలతో వెళ్లి మాల్స్ లో జరుగుతున్న అధిక ధరల దందాను వీడియో తీసి మరీ తమ తమ చానళ్లలో చూపాయి. థియేటర్లలో ప్రతి ఉత్పత్తి ధరా బయటి రేటుతో పోలిస్తే మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. 20 రూపాయల విలువైన కూల్ డ్రింక్ ను పేపర్ గ్లాసుల్లో విక్రయిస్తూ.. దాని ధరను కూడా ఐదింతలు అధికంగా విక్రయిస్తున్నారు.
హైదరాబాద్ లో ప్రముఖ మాల్స్ అయిన పీవీఆర్, ఐనాక్స్, సినీ మ్యాక్స్ లలో ప్రభుత్వ అదేశాలను యధేశ్చగా ఉల్లంఘించాయి. పీవీఆర్ సెంట్రల్ లో పాప్ కార్న్ ప్యాకెట్ ధర రూ. 125 పలుకగా, 650 ఎంఎల్ కూల్ డ్రింక్ పై ధర రూ. 180 పలికింది. ధీయేటర్లు మల్టీఫెక్సులలో ధరఘాతం.. ధన దోపిడిలను అడ్డుకుంటామని తూనికలు కొలతల అధికారులు తెలిపినా.. అడ్డుఅదుపులేకుండా సాగే దోపిడి నిన్న కూడా నిత్యకృత్యంలానే మారింది. ఇక మరో ఎత్తు వేసిన థియేటర్లు, మల్టీప్లెక్సులు.. కాంబోల పేరిట రూ. 300 వరకూ దోచుకున్నారు.
తినుబండారాల ధరలు తగ్గుతాయని ఎంతో అశగా వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఇక బయటి నుంచి ఫలహారాలను, తినుబండారాలను కూడా తీసుకెళ్లేందుకు యాజమాన్యాలు అంగీకరించడం లేదు. కూకట్ పల్లి ప్రాంతంలోని సీనీ పోలిస్ లో వాటర్ బాటిల్ కు రూ. 80 వరకూ, కూల్ డ్రింక్ కు రూ. 160 వరకూ వసూలు చేశారు. కొన్ని మాల్స్ తమకింకా ఉత్తర్వులు అందలేదని అడిగిన వారిపై వాదనలకు దిగాయి. బంజారాహిల్స్ లోని ఐనాక్స్ లో వాటర్ బాటిల్ ను కూడా కింద అంతస్థు నుంచి తీసుకోచ్చామని చెప్పినా అనుమతించలేదు. బిల్లును చూపించినా, సెక్యూరిటీ సిబ్బంది మాత్రం తమ ధోరణి వీడలేదు.
ఇక ఇదే పరిస్థితి దేశ అర్థిక రాజధాని ముంబైలోని మల్లీప్లెక్సులు, ధియేటర్లలో కూడా నెలకొంది. అక్కడ బయట నుంచి అహారాన్ని తీసుకెళ్లేందుకు అనుమతించాలని స్థానికులు యాజమాన్యాలను అడిగినా.. వారు అనుమతించలేదు. తమకు ఇంకా ధరలు తగ్గించాలని అధికారుల నుంచి ఎలాంటి అదేశాలు అందలేదని, ఇక ప్రస్తుతం బొంబై హైకోర్టులో వున్న ఈ అంశం ఈ నెల 8న కానీ తుది తీర్పు వెల్లడి కాదని, అప్పటి వరకు ప్రేక్షకులను బయటి అహారాన్ని తగ్గించమని తేల్చిచెబుతున్నాయి యాజమాన్యాలు. అయితే హైదరాబాద్ లో మాత్రం అధిక ధరలపై పిర్యాదు చేయాలంటే.. టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్స్ యాప్ నంబరు 7330774444ను సంప్రదించాలని అధికారులు మరోమారు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more