ఖాతాల్లో కనీస నగదు నిల్వలులేని వినియోగదారులపై గత ఆర్థిక సంవత్సరం (2017-18) రూ.5వేల కోట్ల జరిమానాలు వేశాయి బ్యాంకులు. ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ప్రధాన బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) వసూలు చేసినవే ఇందులో సగం ఉన్నాయి. లోక్ సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, మరో మూడు ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులు కలిసి రికార్డు స్థాయిలో పెనాల్టీలను వసూలు చేశాయని తెలిపారు.
ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన సంవత్సర కాలంలో ఖాతాదారుల నుంచి కనీస నగదు నిల్వలు లేవని 4వేల 989 కోట్ల రూపాయలు జరిమానా కింద వసూలు చేశాయి. ఇందులో ఎస్బీఐ వసూళ్లే రూ.2వేల 433.87 కోట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఎస్బీఐకి రూ.6,547 కోట్ల నికర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ఇదే ఆర్థిక సంవత్సరం జరిమానాల రూపంలో ఎస్బీఐకి రూ.2,434 కోట్ల ఆదాయం రావడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నది. నిజానికి కనీస నగదు నిల్వలు లేని ఖాతాదారులపై జరిమానాలు తీవ్రంగా ఉన్నాయని ఎస్బీఐపై ఇప్పటికే పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.
ఎస్బీఐ తర్వాత రూ.590.84 కోట్లతో హెచ్.డి.ఎప్.సి బ్యాంక్ ఉన్నది. 2016-17లో రూ. 619.39 కోట్లు వసూలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్ రూ.530.12 కోట్ల వసూలుతో మూడు, రూ.317.6కోట్లతో ఐసిఐసిఐ నాలుగో స్థానంలో, రూ.211 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఐదో స్థానంలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టం రూ.85వేల 361 కోట్లుగా ఉంది. ఏదిఏమైనా వ్యాపారం, దానిపై లాభాల సంగతెలాఉన్నా.. కనీస నగదు నిల్వలు లేని ఖాతాదారులపై జరిమానాల రూపంలో చేస్తున్న వసూళ్లు బ్యాంకులకు భలే ఆదాయం తెచ్చిపెడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more