Varla slams GVL over comments on TDP Government అవినీతే గత చరిత్ర.. అందరికీ అపాదిస్తావా.?

Varla ramaiah slams gvl narasimha rao over comments on tdp government

APSRTC chairman, Varla Ramaiah, Rajya Sabha Member, GVL Narasimha Rao, corruption allegations, TDP Government, CMS, Bhasker Rao, Rs.28 cr assets, UP Government UCs, Modi Government, CAG Report, central Government, andhra pradesh, politics

Andhra Pradesh APSRTC chairman varla ramaiah slams gvl narsimha rao over his corruption comments on TDP Government, question how he earned 28 crores of ruppees assets as submited in his affidavit to election commisson.

అవినీతే గత చరిత్ర.. అందరికీ అపాదిస్తావా.? జీవిఎల్ పై వర్ల ఫైర్

Posted: 08/07/2018 06:33 PM IST
Varla ramaiah slams gvl narasimha rao over comments on tdp government

‘చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది మాత్రం..’ అన్నట్లు తానో నితీ సామ్రాజ్యానికి చక్రవర్తి అయినట్లు బీజేపి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యవహరిస్తూ.. ప్రత్యర్థులపై మాత్రం అవినీతి అరోఫణలు గుప్పిస్తూన్నారని ఆయన గత చరిత్ర అంతా అవినీతిమయమేనని అంధ్రప్రదేశ్ ఏపీఎస్ అర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.  సీఎంఎస్ లో ఉద్యోగం చేసేప్పుడు లేని అస్తులు జీవిఎల్ అనతికాలంలో ఎలా సంపాదించారని ఆయన సూటిగా ప్రశ్నించారు.

సీఎంఎస్ సంస్థలో కూడా ఆయన తన అవినీతి ప్రతాపాన్ని చూపడంతో సంస్థ యాజమాన్యం ఆయనను తొలగించిన మాట వాస్తవం కాదా.? అని నిలదీశారు. ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జీవిఎల్ నరసింహారావు.. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసే క్రమంలో ఎన్నికల కమీషన్ కు సమర్పించే అఫిడవిట్ లో మాత్రం తన అస్తులు రూ.28 కోట్లుగా చూపారని, అవి ఎలా వచ్చాయో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జీవీఎల్ అబద్ధాల కోరు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అఫిడవిట్లో చూపిన ఆస్తులన్నీ అవినీతి సంపాదనేనా అని ప్రశ్నించారు. నిత్యం టీడీపీ ప్రభుత్వంపై అవినీతి అరోపణలు చేస్తున్న జీవీఎల్ కు రాజ్యసభ సీటు కూడా ఎలా వచ్చిందో త్వరలో బయట పెడతామని అన్నారు. సీడీ అకౌంట్ లలో కుంభకోణాలు జరిగాయని అరోపిస్తున్న జీవిఎల్ కు  అసలు పీడీ అకౌంట్ అంటే ఏంటో తెలుసా? అని ప్రశ్నించారు. డీఆర్‌ఎస్‌ కంపెనీ ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు చూపలేదని ఆయన ప్రశ్నించారు. యూసీలు ఇవ్వకపోవడంతోనే అవినీతి జరిగినట్లు జీవిఎల్ భావిస్తున్నారని.. అదే అయకున్న రాజకీయ అవగాహన అని ఎద్దేవా చేశారు.

రూ.15వేల కోట్ల రూపాయలకు యూసీలు ఇవ్వలేదని చెబుతున్న జీవీఎల్.. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం లక్షా 54వేల కోట్ల రూపాయల నిధులకు యూసీలు ఇవ్వలేదన్న విషయం మర్చిపోయారా..? అని నిలదీశారు. యూపీ ప్రభుత్వాన్ని యూసీలు ఎందుకు ఇవ్వలేదని అడగటం మర్చిపోయారా అని ప్రశ్నించారు. జీవీఎల్ అంచనాల ప్రకారం యూపీలోని బీజేపి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు.

ఇక కేంద్ర ప్రభుత్వం కూడా 89వేల కోట్ల రూపాయల విద్యాహక్కు రుసుములకు సంబంధించి లెక్కలు చెప్పలేదని కాగ్ తన నివేదికలో పేర్కొందని.. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. జీవీఎల్ తానొక్కడే నీతిపరుడైనట్లు మాట్లాడుతున్నారని.... ఆయనకు ఐదు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పగల ధైర్యముందా అని సవాల్ విసిరారు. ఆస్తులకు సంబంధించి జీవీఎల్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని వర్ల రామయ్య విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varla Ramaiah  GVL Narasimha Rao  corruption allegations  TDP Government  CMS  politics  

Other Articles