తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఢీఎంకే అధినేత, కళైంజ్ఞర్ కరుణానిధి అంత్యక్రియలను మెరినా బీచ్ లో నిర్వహించేందుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మద్రాసు హైకోర్టు ఇవాళ ఉదయం అనుమతిని మంజూరు చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాజాజీ హాలు వద్దనున్న డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్.. కరుణానిధి చిన్న కుమారుడు స్టాలిన్ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో వున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులకు విషయం తెలియడంతో వారంతా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
రెండు వైపుల నుంచి ఉత్కంఠకరమైన వాదనలను విన్న న్యాయస్థానం.. చివరకు ప్రభుత్వ వాదనను తోసిపుచ్చుతూ కరుణానిధి అంత్యక్రియలను చెన్నైలోని మెరినా బీచ్ లో వున్న అన్నాదురై సమాధి వద్ద నిర్వహించేందుకు అనుమతిని మంజూరు చేసింది. దీంతో తమ ప్రియనేత అంత్యక్రియలను మెరీనా బీచ్ లో చేయాలన్న కోట్లాది మంది డీఎంకే కార్యకర్తలు, అభిమానుల కల నెరవేరనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది.. న్యాయస్థానంలో కేసులు పెండింగ్ లోవున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం వుందని కూడా తెలిపారు.
ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం బీచ్ లో అంత్యక్రియలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లన్నింటినీ కోర్టు కొట్టివేసింది. బీచ్ లో అంత్యక్రియలకు అభ్యంతరం లేదన్న పిటిషన్ దారుల నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పింది. దీంతో మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై వాదనలు సాగుతుండగా, వీటిపై త్వరలో తుది తీర్పు వెలువడనుంది. కరుణానిధి పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ ప్రాంతంలో ఇదే విషయాన్ని మైకుల ద్వారా కార్యకర్తలకు చెప్పడంతో వారిలో ఆనందం పెల్లుబికింది.
కాగా, అంతకుముందు అన్నాదురై సమాధి పక్కనే కరుణ అంత్యక్రియలు చేసేందుకు అనుమతించాలని డిఎంకే నేతలు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కోరారు. అయితే అందుకు ఆయన అనుమతించలేదని.. న్యాయస్థానంలో ఈ విషయమై అనేక కేసులు పెండింగ్ లో వున్నాయని.. దీంతో తాము అనుమతించలేమని.. అనుమతిస్తే న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమవుతాయని తెలిపినట్లు సమాచారం. అయితే గిండిలో రెండు ఎకరాల స్థలం కేటాయిస్తామని కరుణ కుటుంబసభ్యులకు తమిళనాడు ప్రభుత్వం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో మద్రాసు హైకోర్టును అశ్రయించిన డీఎంకే వర్గాలకు సానుకూలంగా మద్రాసు హైకోర్టును తీర్పును వెలువరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more