Mumbai woman tracks down her stolen phone స్మార్ట్ ఫోన్ దొంగను గూగుల్ తో పట్టుకున్న యువతి

Mumbai woman tracked down the man who stole her phone

Xiaomi, RedMI note 4, Zeenat Banu Haq, Teacher, phone thief, my activity, google account, railway, Kaala, Dadar-Tiruvannamalai railway ticket, pnr status. screen shot, Malad, mumbai, crime

A 19-year-old teacher Zeenat Banu Haq, in Mumbai managed to track the man who stole her Xiaomi 4A smartphone by using features offered by a Google account.

స్మార్ట్ ఫోన్ దొంగను గూగుల్ తో పట్టుకున్న యువతి

Posted: 08/09/2018 12:59 PM IST
Mumbai woman tracked down the man who stole her phone

ఒకప్పుడు సెల్ ఫోన్ పోయిందంటే అయ్యే కాంటాక్టులు పోయాయే అని భాదపడే వాళ్లం. కానీ ఈ రోజుల్లో దాదాపుగా అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లే వున్నాయి. అప్పటి ఫోన్ల కన్నా ఖరీదు ఎక్కువ.. అంతేకాదు.. ఇప్పుడి ఫోన్లు పోతే.. దాదాపుగా సమస్తం పోయినట్లే. అదెలా అంటే.. సెక్యూరిటీ ఫీచర్లు, స్ర్కీన్ లాక్ లేకపోతే.. స్మార్ట్ ఫోన్ ను ఓపెన్ చేయగానే అందులో వుంటే మన పర్సనల్ ఈ మెయిల్స్ నుంచి బ్యాంకు అకౌంట్ల వరకు అన్నీ పరాయి వ్యక్తి చేతిలోకి వెళ్లిపోతాయి. దీంతో ఫోన్ కొనగానే ప్రతీ ఒక్కరు తమ ఫోన్ నుంచి గూగుల్ లోకి లాగిన్ అయ్యి.. అందులో తమ కాంటాక్టు లిస్టును పొందుపర్చుకోవడం చాలా మంచింది.

ఎందుకంటే ఇలా చేస్తే ఎప్పుడు ఎక్కడ మీ స్మార్ట్ ఫోన్ పోయినా.. లేక దొంగలించబడినా.. అది వెంటనే మీ వద్దకు వచ్చే మార్గం వుంది. అదెలా అంటే ఈ ముంబై ప్రాంతంతోని ములాద్ కు చెందిన ఈ 19 ఏళ్ల ప్రైవేటు ప్రైమరీ టీచర్ తాను పొగొట్టుకున్న స్మార్ట్ ఫోన్ రాబట్టుకుంది. అంతేకాదు తన ఫోన్ దొంగను కూడా పట్టించింది. దీనంతటికీ అమె కేవలం ఒకరి సాయం మాత్రమే తీసుకుంది. ఎవరు వారు అంటే అదే గూగుల్. జీనత్ బాను హక్(19) కేవలం గూగుల్ సాయంతో తన ఫొన్ ను దక్కించుకోవడంతో పాటు దొంగనువెంటాడి, వేటాడి పట్టుకుని కటకటాల్లోకి పంపగలిగింది.

ఇక్కడి మరోల్ ప్రాంతంలోని ప్రీస్కూల్ లో జీనత్ పనిచేస్తోంది. అయితే ఆదివారం మలద్ ట్రిప్ నుంచి ఇంటికి వచ్చి చూసుకోగా తన రెడ్ మీ 4ఏ ఫోన్ కన్పించలేదు. దీంతో వెంటనే తన గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయిన జీనత్.. పోగొట్టుకున్న ఫోన్ లో లొకేషన్ ను యాక్టివేట్ చేసింది. దీంతో అవతలి వ్యక్తి మొబైల్ లో ఏమేం చేస్తున్నాడు? ఏయే వీడియోలు చూస్తున్నాడు? వంటి సమస్త సమాచారం జీనత్ కు చేరేది.

దీంతో ఆమె మరో ఆండ్రాయిడ్ ఫోన్ సాయంతో తస్కరించిన ఫోన్ పై నిఘా పెట్టింది. తొలుత కాలా సినిమాలో పాటలను సెర్చ్ చేసిన నిందితుడు.. ఆ తర్వాత వాట్సప్ ను అప్ డేట్ చేశాడు. సెల్ఫీ కూడా తీసుకున్నాడు. చివరికి దాదర్ నుంచి తిరువణ్ణమలైకి రైల్వే టికెట్ బుక్ చేశాడు. అనంతరం దాని పీఎన్ఆర్ నంబర్ ను స్క్రీన్ షాట్ తీసుకున్నాడు. దీన్ని గమనించిన జీనత్ అతని ఫొటోతో పాటు పీఎన్ఆర్ నంబర్ తో రైల్వే పోలీసుల్ని ఆశ్రయించింది. చివరికి సోమవారం రైలు బోగీలో ఎక్కిన సెల్వరాజ్ శెట్టి(32)ని రైల్వే అధికారులు దాదర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Xiaomi  RedMI note 4  Zeenat Banu Haq  Teacher  phone thief  my activity  google account  Malad  mumbai  crime  

Other Articles