Sushma Swaraj Volcano Tweet Irks netizens సుష్మాస్వరాజ్.. అగ్నిపర్వతపు ట్వీట్ ఎటకారమేనా.?

Sushma swaraj volcano tweet irks netizens

bali, Bali Vocano Eruption, bali volcano, External Affairs minister, Indian Embassy in Indonesia, Indian mission, Indonesia, Mount Agung, Mount Agung Eruption, Mount Agung volcano, Ngurah Rai International Airport‬, sushma swaraj, volcanic ash

External Affairs Minister Sushma Swaraj was asked on Twitter whether it is safe to travel to Bali, and she responded that she will consult the volcano, this responce from EA minister irk netizens.

సుష్మాస్వరాజ్.. అగ్నిపర్వతపు ట్వీట్ ఎటకారమేనా.?

Posted: 08/09/2018 02:45 PM IST
Sushma swaraj volcano tweet irks netizens

సామాజిక మాద్యమాల్లో నిత్యం చురుగ్గా ఉంటూ.. దేశీయులతో పాటు విదేశీయులకు కూడా అవసరమైన నేపథ్యంలో అపన్నహస్తాన్ని అందించి అదుకునే కేంద్ర విదేశాంగ మంత్రి సుష్వాస్వరాజ్‌ అదే సమాజిక మాద్యమంలో విమర్శలను ఎదుర్కుంటున్నారు. కేంద్ర మంత్రి హోదాలో అమె దేశ ప్రజలు అగిడిన ప్రశ్నలకు సహనంతో బదులివ్వాలే కానీ.. వారిని ఎటకారంగా తీసేసే విధంగా బదులు ఇవ్వరాదని, ఇలాంటివి అమె తన వ్యక్తిగత అకౌంట్ లో పర్వాలేదు కానీ.. కేంద్రమంత్రిగా విదేశీవ్యవహారాల శాఖ అకౌంట్లో మాత్రం తప్పని అమె బదులు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు నెట్ జనులు.

ఇప్పటికే ఎంతో మంది భారతీయులకు స్వదేశంలో అయితేనేం. లేక విదేశాల్లో వున్నవారైతేనేం విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ఏ అంశంలోనేనా ఏ సమస్య వచ్చినా అమె వాటిని వారు అనుకున్న నిర్ణీత తేదీలోగా స్పందించి సాయం అందిస్తుంటారు. ఈ క్రమంలోనే  సుశీల్‌ రాయ్‌ అనే వ్యక్తి ఇండోనేషియాలోని బాలి వెళ్లాలనుకుంటున్నాను.. సురక్షితమేనా అని ట్వీట్‌ చేసి సుష్మాస్వరాజ్ ను ట్యాగ్‌ చేశారు. ‘బాలి వెళ్లడం సురక్షితమేనా? 11.08.18 నుంచి 17.08.18 వరకు బాలి పర్యటనకు ప్రణాళిక వేసుకున్నాం. అక్కడి వెళ్లడం సురక్షితమేనా. మన ప్రభుత్వం ఏదైనా మార్గదర్శకాలు జారీ చేసిందా? దయచేసి మాకు త్వరగా తెలియజేయండి’ అని సుశీల్ రాయ్‌ ట్వీట్‌ చేశారు.

ఆ ట్వీట్‌కు సుష్మ ఏటకారంగా కౌంటర్‌ ఇచ్చారు. ‘నేను అక్కడ అగ్నిపర్వతాన్ని సంప్రదించాలి’ అని సమాధానమిచ్చారు. సుష్మ ట్వీట్ పై చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు దీనిపై జోక్స్‌ చేస్తుండగా, మరికొందరేమో సీరియస్ గా తీసుకుంటున్నారు. సుష్మాజీ తగిన సమాధానమిచ్చారని పలువురు కామెంట్‌ చేశారు. కొందరేమో ఆయన ప్రభుత్వ అడ్వైజరీ గురించి అడగడంలో తప్పేముంది, చాలా దేశాల్లో మార్గదర్శకాలు ఇస్తారని కామెంట్లు చేశారు. అయితే కొందరు మాత్రం కేంద్రమంత్రి హోదాలో సుష్మా ఇలాంటి సమాధానం ఇవ్వడం మాత్రం ముమ్మాటికీ తప్పే అని అభిప్రాయపడుతున్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bali  Vocano  Mount Agung  External Affairs minister  sushma swaraj  Indian Embassy  Indonesia  

Other Articles