బీజేపి అదినాయకుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అస్తమించారు. గత రెండు మాసాలుగా ఆయన తన అనారోగ్య సమస్యలతో పోరాడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో ఇవాళ ఉదయం నుంచి తీవ్ర అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స పొందిన ఆయన ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 94 ఏళ్ల రాజకీయ ధురంధరుడు పరమపదించిన వార్తను ఇప్పటికీ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆయన మరణాన్ని ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆసుపత్రిలో దాదాపు తొమ్మిది వారాల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తుదిశ్వాస విడిచారు. వాజ్ పేయి మరణవార్తతో యావత్ దేశం దు:ఖసాగరంలో మునిగిపోయింది. జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న వాజ్ పేయి... నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకుని, పెంచారు. వాజ్ పేయి మరణంతో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. మరోవైపు, వాజ్ పేయి నివాసం వద్దకు ప్రధాని మోదీ, బీజేపీ నేతలు చేరుకున్నారు.
వాజ్ పేయ్ ప్రస్థానం ప్రారంభమైందిలా..
1926, డిసెంబర్ 25న ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సమీపంలోన బద్దేశ్వర్ లో వాజ్ పేయ్ జన్మించారు.
తల్లీదండ్రులు శ్రీకృష్ణ బిహారీ వాజిపాయ్, కృష్ణాదేవి
విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితులయ్యారురాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు
దేశసేవ కోసం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయారు.
ఆర్ఎస్ఎస్ పత్రికకు సంపాదకుడిగా వ్యవహారించారు.
1951లో జన్ సంఘ్ ను ఏర్పాటు చేశారు.
జన్ సంఘ్ వేదికగా క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.
31 ఏళ్ల వయస్సులోనే లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం లో విదేశాంగ శాఖ మంత్రిగా పని చేశారు.
1968లో జన్ సంఘ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1980లో ఎల్ కే అద్వానీ, షెకావత్ లతో కలసి వాజ్ పేయి బీజేపీని స్థాపించారు
1996లో తొలిసారిగా వాజ్ పేయి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
సంఖ్యాబలం లేక 13 రోజులకే ప్రధాని పదవి నుంచి దిగిపోయారు
1998లో రెండోసారి ప్రధానిగా అటల్ బిహారీ వాజ్ పేయి ప్రమాణ స్వీకారం చేశారు. అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజ్ పేయి ప్రధాని పీఠం నుంచి వైదొలిగారు.
1999లో ముచ్చటగా మూడోసారి వాజ్ పేయి ప్రధాని పీఠాన్ని అధిష్టించారు.2004 వరకు ఆయన ప్రధానిగా కొనసాగారు. కార్గిల్ యుద్ధం కూడా ఆయన హయాంలోనే జరిగింది.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మాదిరిగా.. వాజ్ పేయి కూడా మూడు సార్లు ప్రధాని పీఠం అధిష్టించారు.
2005లో రాజకీయాల నుంచి వాజ్ పేయి నిష్క్రమించారు.
2018 ఆగస్టు 16న రాజకీయ భీష్ముడు తుదిశ్వాస విడిచారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more