మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి భౌతిక కాయానికి తుది వీడ్కోలు పలికి.. నివాళులు అర్పించేందుకు దేశంలోని అన్ని పార్టీల రాజకీయ నేతలు క్యూ కడుతున్నారు. అటల్ జీ తో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకుంటున్నారు. బీజేపి సహా బీజేపియేతర, ఎన్డీయేతర పార్టీల నేతలు కూడా వాజ్ పాయ్ బౌతిక ఖాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన వాజ్పేయికి ఆ పార్టీ నేతలు నివాళి అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, అంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వాజ్ పేయి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు.
అటల్ జీ పరమపదించిన ఆనంతరం నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్ అసుపత్రి నుంచి ఆయన పార్థీవ దేహాన్ని ఇంటికి తరలించడంతో ఆయన నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీంతో క్రితం రోజు సాయంత్రం నుంచి వాజ్ పేయి నివాసాని పెద్ద సంఖ్యలో ప్రజలు, బీజేపి నేతలు, వివిధ పార్టీల రాజకీయ నేతలు ఆయనకు అంజలి ఘటించారు. కాగా కొద్దిసేపటి క్రితం అటల్ జీ బౌతిక ఖాయాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఇక్కడ మధ్యాహ్నం ఒకటిన్నరకు వాజ్ పేయి తమ పార్టీ నేతల కోసం ఉంచనున్నారు.
ఇప్పటికే పలువురు పార్టీల అధినేతలు హస్తినలో ఉన్నారు. అటల్ జీని ఆఖరి సారి చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రపతి కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు నియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులు మహానేతకు నివాళి అర్పించారు. ఆయన నివాసానికి చేరుకున్న ప్రముఖులు తుదిచూపు కోసం బారులు తీరారు. బీజేపి పాలిత రాష్ట్రాల్లో ఏడు రోజుల పాటు సంతాప దినాలను పాటించడంతో పాటు జాతీయ జెండాను అవతనం చేయాలన్న అదేశాలను కూడా పార్టీ పంపింది.
ఇక మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు వాజ్ పేయి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో వివిధ పార్టీల రాజకీయ నేతలు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, బీజేపి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు పాల్గోననున్నారు. కాగా యమునా తీరంలో ఆయనకు స్మృతివనం నిర్మించనున్నారు. గతంలో యమునా నది ఒడ్డున ఎలాంటి స్మారక నిర్మాణాలు చేపట్టకూడదన్న ఆదేశాలను రద్దు చేశారు. దీనిపై ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది.
Congress President @RahulGandhi paid his last respects to the former Prime Minister Atal Bihari Vajpayee. pic.twitter.com/hlz4qFkzYr
— Congress (@INCIndia) August 17, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more