వరుణుడి కోపమో లేక ఏ దేవుడి శాపమో తెలియదు కానీ.. భూతల స్వర్గాన్ని ప్రకృతి రమణీయతను సంతరించుకున్న కేరళ ఇవాళ కకావికలమైంది. ఓ దేవుడు అగ్రహించినా.. మరో దేవుడు అభయప్రధాతగా నిలుస్తాడి విశ్వసిస్తూ అపన్న హస్తం కోసం ఎదురుచూస్తుంది. అయితే ప్రకృతి ప్రళయానికి చిన్నాభిన్నమైన కేరళలోని భారీ వర్షాలు.. అనాదిగా వస్తున్న ఆచారాలపై ప్రభావం చూపాయి. శబరిమల ఆలయంలో ఏటా నిర్వహించే నిరపుతిరి వేడుకలు ఈ ఏడాది అత్యంత సాదాసీదగా నిర్వహించారు. ఆలయానికి వచ్చే దారుల్లోని నదులు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో ఈ ఏడాది భక్తుల రాకపై ఆంక్షలు విధించారు. దీంతో ఆలయ చరిత్రలోనే తొలిసారి భక్తులు లేకుండా ప్రతిష్టాత్మక పూజలు జరిగాయి.
కేరళను అతలాకుతలం చేస్తున్న వర్షాలు శబరి అయ్యప్ప స్వామి ఆలయంపైన కూడా ప్రభావం చూపాయి. ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నిరపుతిరి పూజలు చరిత్రలోనే తొలిసారిగా భక్తులు లేకుండానే నిర్వహించారు. ఏటా సాగుకు ముందు వరి కంకులను తెచ్చి స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం రైతులకు వీటిని అందజేస్తారు. దీని వల్ల పంటలు బాగా పండుతాయని రైతులతో పాటు స్ధానికుల నమ్మకం. అయితే ఈ ఏడాది పంపా నది పొంగిపొర్లుతూ ఉండటంతో భక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
ఆలయంలో నిర్వహించే పూజల్లో నిరపుతిరి వేడుకకు ప్రత్యేక స్ధానం ఉంది. ఈ పూజ చేసేందుకే ఆగస్టులో ఆలయాన్ని తెరుస్తారు. బాజాభజంత్రీల నడుమ మంగళ వాయిద్యాల మధ్య అత్యంత వైభవంగా వేడుకను నిర్వహిస్తారు. ఆలయ వర్గాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉండే రైతులు, వివిధ ప్రాంతాల ప్రజలు ఈ పూజ కోసమే ఇక్కడకు వస్తారు. అలాంటిది వరదల కారణంగా తొలి సారి అత్యంత సాధారణంగా జరిగిందని ఆలయ వర్గాలు అంటున్నాయి. పంపా నదీ మహోగ్రరూపం దాల్చడంతో ట్రావెన్స్‌కోర్ యాజమాన్యం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ సారి భక్తులను వేడుకకు రావద్దంటూ కొరింది. దీనికి తోడు ఆలయానికి వచ్చే అన్ని మార్గాలను చెంగనూరు నుంచి పంపా వరకు పోలీసులు మూసివేశారు.
మరో 48 గంటలు వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో నదుల మీదుగా ఎవరిని అనుతించమని ప్రకటించడంతో భక్తులు ఈ ఏడాది పూజలకు దూరమయ్యారు. ఆలయ చరిత్రలోనే తొలిసారిగా ఇలా జరిగిందంటున్న ఆలయ అర్చకులు, ట్రావెన్స్ కోర్ యాజమాన్యం భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పూజను వాయిదా వేయాలని ప్రయత్నించిన సాధ్యం కాలేదని ప్రకటించింది. తప్పనిసరి పరిస్ధితుల్లోనే భక్తులు లేకుండానే పూజలు నిర్వహించాల్సి వచ్చిందంటూ భక్తులకు విన్నవించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more