Depressed man kills wife, daughters, self యూపీలో మరో మాస్ మరణం.. హత్యాలా.? అత్మహత్యలా?

Up 5 members of family found dead inside locked house

mass murder, family death, dhumanganj, Allahabad SSP, Nitin Tiwari, Allahabad, Uttar Pradesh, crime

Five members of a family, including three minors, were found dead inside their locked house by the Allahabad Police late on Monday night.

యూపీలో మరో మాస్ మరణం.. హత్యాలా.? అత్మహత్యలా?

Posted: 08/21/2018 09:06 AM IST
Up 5 members of family found dead inside locked house

ఉత్తరప్రదేశ్ లో మరో కుటుంబం సామూహికంగా మరణించిన వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్.  ధుమాంగంజ్ ప్రాంతంలో అత్యంత దారుణంగా కుటుంబ సామూహిక మరణాలు జరిగాయి. కుటుంబ పెద్ద ఆయన మూడో కూతరు శావాలు మాత్రమే కనిపించగా, ఆయన భార్య మిగిలిన ఇద్దరు కూమార్తెల శవాలు మాత్రం సూట్ కేసు, బీరువా, ఫ్రిడ్జిలలో వుండటం.. పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే ఇవి అత్మహత్యలా.. లేక హత్యలా అన్న కోణంలో పోలీసులు కేసులు చేధించేపనిలో వున్నారు.

ధుమాంగంజ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో నుంచి తదేకంగా దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. దీంతో రంగంలోకి దిగన పోలీసలు.. ఇంటికి వేసున్న తాళం పగులగొట్టి పరిశీలించగా.. ఇంట్లోంచి ఏకంగా ఐదు మృతదేహాలు కనిపించాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, హాలులోకి వెళ్లగానే అక్కడ కుటుంబ యజమాని అనుమానాస్పద స్థితిలో సీలింగుకి వేలాడుతూ కనిపించాడు. మరో గదిలోని సూట్ కేసు, బీరువాల్లో ఆయన ఇద్దరు కుమార్తెల మృతదేహాలు, మరో గదిలో నేలపై మూడో కుమార్తె మృతదేహం, ఫ్రిజ్ లో భార్య మృతదేహం కనిపించాయి.

హత్య చేసిన తరువాత బలవంతంగా ఫ్రిజ్, బీరువా, సూట్ కేసుల్లో భార్య పిల్లల మృతదేహాలను కుక్కి ఉంచినట్లు పోలీసులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తన భార్య, కుమార్తెలను హత్య చేసిన ఆ కుటుంబ యజమాని కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న కోణంలో విచారనను ప్రారంభిస్తున్నామని, చెప్పిన పోలీసుల ఇంటి బయట తాళం వేసి ఉండటంతో ఇవి హత్యలా.? లేక అత్మహత్యలా అన్న కోణంలోనూ కేసును లోతుగా విచారిస్తున్నామని అలహాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నితిన్ తివారీ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mass murder  family death  dhumanganj  Allahabad SSP  Nitin Tiwari  Allahabad  Uttar Pradesh  crime  

Other Articles