Corporator pleads at the feet of RTA official ఆర్టీఏ అధికారులపై కార్పోరేటర్ వినూత్న నిరసన

Corporator s new protest technique pleads at the feet of rta official

Corporator, TRS, GHMC, RTA Officials, Sama Thirumala Reddy, Hayathnagar, lorries, novel protest, MVI Saibaba

TRS Corporator Sama Thirumala Reddy of Hayathnagar Division resorted to a novel “protest”. He fell at the feet of an RTA official pleading not to allow heavy sand and stone laden lorries in the colony roads of his division.

ITEMVIDEOS: ఆర్టీఏ అధికారులపై కార్పోరేటర్ వినూత్న నిరసన

Posted: 08/21/2018 08:13 AM IST
Corporator s new protest technique pleads at the feet of rta official

హెవీ లోడ్ తో నగరంలోకి వస్తున్న టిప్పర్ లారీల నుంచి తమ రోడ్లను, రోడ్లపై ప్రయాణాలు సాగిస్తున్న తన డివిజన్ ప్రజల ప్రాణాలను కాపాడాలని ఓ కార్పోరేటర్ వినూత్న రితిలో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో కార్పొరేటర్ నిరసన చేపట్టడం ఆ దృష్టాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది.? ఏ నగరంలో అన్నదే మీ సందేహం కదా.? ఇక వినూత్న నిరసన ఏ రూపంలో అన్నదే మీ మదిని తొలిచేస్తుంది కదూ..

హైదరాబాద్ మహానగరం జీహెచ్ఎంసీ పరిధిలోని హయత్ నగర్ డివిజన్ పరిధిలో టిప్పర్ లారీలు, రాకెట్ లారీలు.. ఇసుక, కంకరలను ఫుల్ లోడ్డు వేసుకుని  తమ రోడ్డపై శరవేగంగా తిరుగుతూ పాడుచేస్తున్నాయని అలాంటి వాహనాలను నిలపివేయాలని కోరుతూ హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అధిక లోడు రవాణాని అదుపు చేయండి అంటూ రవాణా శాఖ అధికారుల కాళ్లు పట్టుకున్నారు.

కార్పొరేటర్, రవాణాశాఖ అధికారుల కాళ్లు పట్టుకోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కంగారు పడ్డ రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటామని కొర్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డికి హామీ ఇచ్చారు. గత కొంతకాలంగా కంకర తరలిస్తున్న టిప్పర్ లారీలు అధిక లోడుతో హయత్ నగర్ మీదుగా సిటీలోకి వస్తుండటంతో రోడ్లు పాడవుతున్నాయని కార్పొరేటర్ తిరుమల్ రెడ్డి వాపోతున్నారు. టిప్పర్ లారీలపై కేసులు నమోదు చేసి అధికలోడ్ రవాణాన్ని అరికట్టాలని పదేపదే అధికారులను కోరుతున్నారు. ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా అధికారులు స్పందించకపోవడంతో తనదైన శైలిలో నిరసన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Corporator  TRS  GHMC  RTA Officials  Sama Thirumala Reddy  Hayathnagar  lorries  novel protest  MVI Saibaba  

Other Articles