సంపద సృష్టి కోసం యవత ఈ మధ్యకాలంలో అధికంగా మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంచుకుంటున్నారు. అయితే యువతను అకర్షించి తమ వైపు మళ్లించుకుని తమ ద్వారా వారిని పలు రకాల స్కీముల్లో చేర్పించేందుకు కూడా అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. అనేక సంస్థలు మ్యూచువల్ ఫండ్స్ ను ప్రవేశపెడుతూ, సేవల రూపంలో కస్టమర్లపై వీర బాదుడు బాదుతున్నాయి. దీనిని అరికడుతూ తాము కేవలం నామమాత్రపు రుసుముతోనే సేవలను అందిస్తామని, అవసరమైతే ఉచిత సేవలను కూడా అందిస్తామని ముందుకు వచ్చింది మరో సంస్థ.
అదే డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం. తమ ఖాతాదారులకు మ్యూచువల్ ఫండ్ సేవలను ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. తమ సబ్సిడరీ ‘పేటీఎం మనీ’ ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన డైరెక్ట్ ప్లాన్స్‌కు చెందిన మ్యూచువల్ ఫండ్ పథకాలను మరో రెండు వారాల్లో అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ‘పెట్టుబడులు పెట్టే విధానాన్ని సరళీకృతం చేసి పారదర్శకంగా సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం మా క్ష్యం’ అని పేటీఎం మనీ పూర్తికాల సంచాలకుడు ప్రవీణ్ జాదవ్ తెలిపారు.
'మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ప్రస్తుతం 2 కోట్ల మంది మదుపరులున్నారు. రానున్న ఐదేళ్లలో మరో మూడు కోట్ల మంది కొత్త పెట్టుబడిదారులు వస్తారు. ఈ స్థితిలో మంచి సేవలు అందుబాటులోకి తెస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నది మా అంచనా’ అని ఆయన భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. పెట్టుబడులు, సంపద సృష్టి కోసం ఓ వేదిక రూపొందిస్తున్నామని, తమ ప్రయత్నం పట్ల ఇప్పటికే 7.7 లక్షల మంది ఖాతాదారులు ఆసక్తి చూపి పేర్లు నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more