లోక్సభ ఎన్నికలను ఇప్పటికిప్పుడు నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీ 70కి పైగా సీట్లను కోల్పోతుందని పోలింగ్ ఏజెన్సీ సంస్థ నేతా యాప్ అంచనా వేస్తోంది. ఈ యాప్ ప్రజా ప్రతినిధులపై ప్రజలకున్న అభిప్రాయాలను సేకరించి, ఆ తర్వాత వాటిని సమీక్షించి నివేదికలు రూపొందిస్తుంటుంది. తాజాగా లోక్సభ ఎన్నికలపై కొన్ని అంచనాలను వెల్లడించింది. గత మూడు నెలలుగా ప్రజల్లో బీజేపికున్న విశ్వాసం సన్నగిల్లినట్లు కన్పిస్తోందని నేతా యాప్ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.
ఇదే సమయంలో కాంగ్రెస్ పట్టు సాధిస్తోందని తెలిపింది. లోక్సభ ఎన్నికలు గనుక ఇప్పుడే నిర్వహిస్తే భాజపా 70కి పైగా సీట్లు కోల్పోయే అవకాశముందని చెబుతోంది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపి 282 సీట్లు సాధించగా.. ఇప్పుడు ఎన్నికలొస్తే ఆ సంఖ్య 212కు తగ్గుందని అంచనా వేస్తోంది. ఇక కాంగ్రెస్ సంఖ్యా బలం 44 నుంచి 110కి పెరుగుతుందని నేతా యాప్ పేర్కొంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే ముందంజలో నిలుస్తుందని అభిప్రాయపడింది.
నేతా యాప్ సీఈవో రాబిన్ శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ధఫా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ అధికారాన్ని అందుకునే అవకాశాలు వున్నాయిని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే కంటే ఎక్కువగా కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. పాపులర్ లీడర్ రేటింగ్లో గెహ్లాట్ కు 42.3శాతం ఓట్లు రాగా.. రాజేకు 33.3శాతమే వచ్చాయన్నారు. ఇక మధ్యప్రదేశ్ లో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కు 42.6శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాకు 48.9శాతం ఓట్లు వచ్చినట్లు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more