రాఖీ పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఇద్దరు ఉపాధ్యయులు చేసిన అతి కాస్తా.. విద్యార్థి అత్మహత్యయత్నానికి కారణమైంది. ప్రస్లుతం బాధిత విద్యార్థి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ అస్పత్రిలో చికిత్స పోందేందుకు కూడా కారణమైంది. తన గర్ల్ ఫ్రెండ్ తో రాఖీ కట్టించిన ప్రిన్సిఫల్, ఇద్దరు టీచర్ల వ్యవహారంతో తనకు అవమానం జరిగిందన్న భాధ, మనోవేధనతో ఓ విద్యార్థి ఏకంగా స్కూల్ బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 18 సంవత్సరాల విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన అగర్తాలలో చోటుచేసుకుంది.
ఈ ఘటనలో ప్రధానోపాధ్యాయురాలు, ఇద్దరు టీచర్ల పాత్ర అధికంగా వుందని, బాధిత విద్యార్థి తల్లిదండ్రులు అరోపించారు. ప్రిన్సిఫాల్ గదిలో టీచర్ల అందరి సమక్షంలో తన జూనియర్ విద్యార్థినికి తమ కొడుకుతో బలవంతంగా రాఖీ కట్టించారని, అయితే ఈ చర్యలను తమ సున్నిత మనస్కుడైన అబ్బాయి జీర్ణించుకోలేడని తాము కూడా పదే పదే వద్దని వారిస్తున్నా వినిపించుకోని ప్రిన్సిపాల్. టీచర్లు వెంటపడి మరి కట్టించారని వారు అరోపించారు. అంతటితో అగకుండా ఓ టీచర్ ఏకంగా రాఖీ కడుతున్న దృష్యాలను తమ సెల్ ఫోనులో వీడియో కూడా తీశారని వారు అరోపించారు.
మరోమారు విద్యార్థినితో కలసి తిరిగినట్లు తెలిస్తే పాఠశాల నుంచి కూడా పంపేస్తామని వారు హెచ్చరించారని, అంతేకాకుండా ఈ ఘటన జరుగుతున్నప్పుడు పాఠశాల ఉపాధ్యాయులు కొందరితో పాటు 12వ తరగతి విద్యార్థులు కూడా అక్కడే వున్నారని కూడా అరోపించారు. కనీసం ప్రిన్సిపాల్ గది నుంచి వారిని పంపాలని తాను కోరినా.. అందరి సమక్షంలోనే రాఖీ కట్టాలని ఇది తప్పు కాదుగా అని వాదించినట్లు కూడా బాధిత విద్యార్థి తండ్రి చెప్పారు. ప్రిన్సిపాల్ రూం నుంచి బయటకు రాగానే తన తోటి స్నేహితులు వ్యంగంగా వ్యాఖ్యలు చేయడంతో మానసిక క్షోభకు గురైన తమ కొడుకు పాఠశాల భవనం ఎక్కి దూకేసాడని అవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిలీప్ కుమార్ సాహా అనే 12వ తరగతి విద్యార్థి అదే పాఠశాలలో చదువుతున్న మరో యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రిన్సిపల్ తో పాటు కొందరు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమక్షంలోనే ఆ యువతితో దిలీప్ కు రాఖీ కట్టించారు. ఇందుకు విద్యార్థులిద్దరు నిరాకరించారు. అయినప్పటికీ పాఠశాల యజమాన్యం ఒత్తిడి చేయడంతో యువకుడు వెంటనే పాఠశాల రెండో అంతస్తుకి వెళ్లి దూకేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఇతర విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. కాగా ప్రభుత్వం కూడా పోలీసు విచారణతో పాటు మరో విచారణను కూడా చేపట్టేందుకు ప్రభుత్వ అధికారులతో ఎంక్వైరీ కమిటీని వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more