పలువురు నిందితుల నుంచి తాము స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను ఎగ్జిబిట్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోరడంతో ఢిల్లీ పోలీసులు ఏకంగా మైండ్ బ్లాక్ అయ్యే వింత సమాధానం ఇచ్చారు. వారి సమాధానంతో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు కూడా ఏం చెప్పాలో తెలియక అసహనంతో ఎం తమాజాగా వుందా.? అంటూ కూడా వ్యాఖ్యానించింది. ఇంతకీ ఏమిటీ సమాధానం అంటారా.?
వివిధ కేసుల్లో పట్టుబడ్డ వస్తువులకు కస్టోడియన్ గా వుండే పోలీసులు.. వాటికి సంబంధించిన కేసు విచారణకు వచ్చినప్పడు సంబంధిత వస్తువులను ఎగ్జిబిట్ గా చూపించాల్సి వుంటుంది. నార్కోటిక్స్, డ్రగ్స్ కేసులలో విచారణ సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాలను న్యాయస్థానంలో చూపించలేకపోయారు. దీంతో అవి ఏమయ్యాయని అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం ప్రశ్నించడంతో.. వాటిని ఎలుకలు తినేశాయని ఢిల్లీ పోలీసులు వింత సమాధానం ఇవ్వడంతో న్యాయమూర్తులు ఆశ్చర్యపోయారు. పోలీస్ స్టేషన్లో డ్రగ్స్ భద్రపరిచిన గదుల్లో ఎలుకలు ఉన్నాయని, అవే వాటిని తినేశాయని పోలీసులు చెప్పుకొచ్చారు.
ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లలో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఇతరత్ర చెత్తాచెదారంతో స్టేషన్లలో పరిశుభ్రత కొరవడిందన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణ చేసింది. జస్టిస్ మదన్ బీ లోకూర్ , జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేసును విచారణ చేసింది. కొన్ని ఏళ్లు గడిచినప్పటికీ కూడా స్వాధీనం చేసుకున్న వాహనాలను ఎందుకు విక్రయించలేదని పోలీస్ శాఖను ధర్మాసనం ప్రశ్నించింది. వాహనాల ఓనర్లు తమ వాహనాలను తీసుకునేందుకు రాకపోతే అమ్మేయాలని సూచించింది.
నార్కోటిక్స్ లేదా డ్రగ్స్ కేసులు విచారణకు వచ్చిన సమయంలో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను ఎలుకలు తినేశాయని పోలీసులు కోర్టులకు చెప్పడం ఎంత మేరకు వాస్తవమని జస్టిస్ దీపక్ గుప్తా ప్రశ్నించారు. నార్కోటిక్స్ కేసులు మూడు నాలుగేళ్ల తర్వాత విచారణకు వస్తే పోలీస్ స్టేషన్లలో స్వాధీనం చేసుకుని స్టోర్ రూమ్ లలో ఉంచిన మెటీరియల్ కనిపించదని అది ఏమిటని ప్రశ్నిస్తే ఎలుకలు తినేశాయని పోలీసులు చెబుతున్నారని జస్టిస్ దీపక్ గుప్తా అన్నారు. ఈ క్రమంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం బయటకంటే పోలీస్ స్టేషన్లోని స్టోర్ రూమ్ల నుంచే డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోందని తెలిపింది.
100 కేజీల హెరాయిన్ దొరికితే.. అందులో కొంచెం కూడా స్టోర్ రూమ్లో ఉండదని బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాదు పట్టుబడ్డ వాహనాలకు సంబంధించిన ఓనర్ పోలీస్ స్టేషన్కు మూడు నెలల్లోగా రాకపోతే వాటిని ఎందుకు విక్రయించడంలేదని ప్రశ్నించింది. వాహనం విక్రయించాక దాని యజమాని వస్తే ఆ డబ్బును అతనికి చెల్లించండి లేదా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో వేయండి అంటూ ఆదేశించింది. దీనికి సమాధానం ఇచ్చిన పోలీస్ శాఖ... స్వాధీనం చేసుకున్న వాహనాలు కోర్టు సొత్తని తాము కేవలం కస్టోడియన్గానే వ్యవహరిస్తామని తెలిపింది. పిటిషన్ను విన్న సుప్రీంకోర్టు అక్టోబర్ 10 కేసును వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more