అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన పర్యటనను కొందరు దుండగులు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా ఆయన కాన్వాయ్ వెళ్లే దారిలో నల్లజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. అయినా ముందుకు సాగుతున్న కాన్వాయ్ పై రాళ్లు విసిరి నల్లజెండాలు ప్రదర్శించారు. సిద్ధి జిల్లాలోని చుహాట్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
15 సెకన్లు నిడివి ఉన్న ఈ వీడియోలో సీఎం చౌహాన్ ప్రయాణిస్తున్న బస్సు ముందు కొందరు నల్లజెండాలు ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి దాదాపు 20 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారకార్యక్రమాలను సీఎం చౌహాన్ కొనసాగిస్తున్నారు. కాగా, చుహాట్ ప్రాంతానికి ఆయన కాన్వాయ్ చేరుకోగానే కొందరు అగంతకులు రాళ్లదాడి జరుపగా, అది ప్రతిపక్ష నేత అజయ్ సింగ్ అసెంబ్లీ నియోజకవర్గమని బీజేపీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
అయితే ఈ ఘటనతో కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదనీ.. తన ప్రతిష్టను దెబ్బకొట్టేందుకే బీజేపీ నేతలు ఇలా కుట్రపన్నుతున్నారని సింగ్ ఆరోపించారు. ఇటీవల తాను చేపట్టిన ‘జన ఆశీర్వాద యాత్ర’ కోసం సీఎం చౌహాన్ ఓ బస్సునే ప్రచార రథంగా మార్చుకున్నారు. ఈ ఘటనలో క్షేమంగా బయటపడిన ఆయన... కొద్ది సేపటి తర్వాత జరిగిన ఓ సభలో మాట్లాడుతూ...‘‘అజయ్‌సింగ్.. నీకు దమ్ముంటే బహిరంగంగా ముందుకు వచ్చి పోరాడు. నేను భౌతికంగా బలహీనుడిని కావచ్చు.. కానీ ఆటలు నా ముందు సాగవు.. రాష్ట్రప్రజలు నాకు అండగా ఉన్నారు..’’ అంటూ సవాల్ విసిరారు.
#WATCH: Black flags shown to Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan & stones hurled at his vehicle in Sidhi during Jan Ashirwad Yatra. (02.09.18) pic.twitter.com/OVHoPVy7Hx
— ANI (@ANI) September 3, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more