head constable beats women with slipper కానిస్టేబుల్ కావరం.. మహిళలపై చెప్పుతో దాడి..

Drunken head constable beats women with slipper in the name of investigation

police beats women with slipper, venkateshwar rao, head constable, konda venkatappaiah colony, women, inquiry, slipper, photos, guntur, nagarampalem police station, andhra pradesh, viral, crime

drunken head constable venkateshwar rao of nagarampalem police station beats women with slipper in the name of investigation in mid night.

కానిస్టేబుల్ కావరం.. మహిళలపై చెప్పుతో దాడి..

Posted: 09/03/2018 10:39 AM IST
Drunken head constable beats women with slipper in the name of investigation

చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పే రక్షకభట్టులు తాము మాత్రం చట్టానికి అతీతమని వ్యవహరిస్తూ.. చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్.. అర్థరాత్రి పూట మహిళలను స్టేషన్లో వుంచడంతో పాటు వారిని విచారించే క్రమంలో మహిళా కానిస్టేబుళ్లకు ఆ పనిని అప్పగించాల్సిందిపోయి.. తానే విచారణ పేరుతో దారుణంగా వ్యవహరించాడు.

మహిళ అన్న విచక్షణ కూడా లేకుండా అమెపై ఏకంగా చెప్పుతో దాడి చేశాడు. గుంటూరు జిల్లాలోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నగరపాలెం ఠాణా హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వరరావు ఆదివారం రాత్రి పోలిస్ స్టేషన్లో వీరంగం సృష్టించాడు. విచారణ కోసం స్టేషన్ కు తీసుకొచ్చిన మహిళలపై చెప్పుతో దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే ఆమెను చెప్పుతో కొట్టాడు. నగరంలోని కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన కొందరు మహిళలను హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటేశ్వరరావు విచారణ పేరిట స్టేషన్‌కు తీసుకొచ్చారు.

రాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆయన మహిళల వద్దకు వచ్చి వీరంగం సృష్టించాడు.‌ ఓ మహిళను చెప్పుతో కొట్టాడు. ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు ఫొటోలు తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టారు. స్టేషన్లో ఎవరి అనుమతి లేకుండానే హెడ్‌‌ కానిస్టేబుల్‌ మహిళలను స్టేషన్ కు తీసుకొచ్చినట్లు తెలిసింది. ఘటన జరిగిన సమయంలో కానిస్టేబుల్‌ మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ పూర్తయిన అనంతరం కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : head constable  women  enquiry  slipper  guntur  nagarampalem police station  andhra pradesh  

Other Articles