మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్లను ఆశించే ఆశావహులకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఈ సారి కాంగ్రెస్ గెలుపొందుతుందన్న అంచనాలు తెరపైకి వస్తున్న క్రమంలో చాలా మంది కాంగ్రెస్ టికెట్లను పోందేందుకు బరిలో నిలుస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం సోషల్ మీడియాలో బలమైన బలగం వుంటే తప్ప టికెట్లు ఇవ్వమని తేల్చిచెప్పింది. ప్రజలతో అనుసంధానం వుండటంతో పాటు నేటి యువత అధికంగా సోషల్ మీడియానే ఫాలో అవుంతుందని ఈ క్రమంలో అన్ లైన్ లో తగు బలం, బలగం చూపించిన నేతలకు మాత్రమే టికెట్లను ఇస్తామని స్పష్టం చేసింది.
దీంతో ఇన్నాళ్లు టికెట్ల వేటలో భాగంగా ఢిల్లీలోని గల్లీల చుట్టూ తిరేగ నాయకులు ఇక సోషల్ మీడియాలో తమ సత్తాను చాటేందుకు రెడీ అవుతున్నారు. అటు షేస్ బుక్, ఇటు ట్విట్టర్ లలో భారీగా ఫాలోవర్లు పెంచుకునే ప్రయత్నాలు చేపడుతున్నారు. సోషల్ మీడియాలో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నేతలు తప్పనిసరిగా ట్విటర్, ఫేస్బుక్లో ఖాతాలు కలిగిఉండాలని వెల్లడించింది.
సోషల్ మీడియాలో చురుకుగా ఉండటమే కాకుండా నేతలకు ఫేస్బుక్లో కనీసం 15,000 లైకులు, ట్విటర్లో 5000 మంది ఫాలోవర్లను కలిగిఉండాలని, పెద్ద సంఖ్యలో వాట్సాప్ గ్రూపుల్లో ఉండాలని పేర్కొంది. వారంతా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పోస్టులను రీట్వీట్ చేయాలని, లైక్ కొట్టాలని కోరింది. పార్టీ అధికారిక పేజీల్లో పోస్టులను తమ పేజీల్లో షేర్ చేయాలని సూచించింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే నేతలంతా ఈనెల 15లోగా వారి సోషల్ మీడియా ఖాతాల వివరాలను పార్టీకి అందచేయాలని కోరింది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నెటిజన్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ సైబర్ సైనికులు, కాంగ్రెస్కు చెందిన రాజీవ్ సిపాయిలు నిమగ్నమయ్యారు. బీజేపీ ఇప్పటికే 65000 మంది సైబర్ సైనికులను రంగంలోకి దించగా, కాంగ్రెస్ పార్టీ తరపున 4000 మంది రాజీవ్ సిపాయిలు పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు తమపై బురద చల్లితే సోషల్ మీడియా వేదికగా తాము తిప్పికొడుతున్నామని బీజేపీ, కాంగ్రెస్ ఐటీ విభాగం చెబుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more