IndiGo's festive sale: 999 On 10 Lakh Seats ఇండిగో పండగ అఫర్.. రూ.999లకే విమానయానం..

Indigo offers 10 lakh seats at fares starting rs 999

indigo, indigo sale, indigo offer, cheap flight tickets, goindigo.in, indigo festive sale, indigo tickets, indigo discount, indigo ticket sales, indigo ticket offer, festival sale offer, cheap flight tickets, goindigo.in, discount sale, 10 lakh seats

Budget carrier IndiGo is offering up to 10 lakh seats for sale at a heavily-discounted ticket price, starting as low as Rs 999, for a one-way travel across its network.

ఇండిగో పండగ అఫర్.. రూ.999లకే విమానయానం..

Posted: 09/03/2018 05:20 PM IST
Indigo offers 10 lakh seats at fares starting rs 999

చౌకధర విమానయాన సంస్థగా విమానయాన ప్రయాణికులకు తక్కువ ధరలోనే విమానయాన సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్న ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తాజాగా తమ కస్టమర్లకు మరో బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. ఇవాళ్లి నుంచి ఇండిగో సంస్థ ‘ఫెస్టివల్ సేల్’ ను ప్రారంభించింది. ‘ఫెస్టివల్ సేల్’ పేరిట ప్రయాణికులకు భారీ ఆఫర్ తో పాటుగా క్యాష్ బ్యాక్ అవకాశాన్ని కూడా కల్పించనున్నట్లు ప్రకటించింది.

ఈ ఆఫర్ కింద ఈ నెల 18 నుంచి 2019 మార్చి 30 మధ్య ప్రయాణించే నిమిత్తం ఈ ఆఫర్ ను ప్రకటించారు. నాలుగు రోజుల పాటు ఈ ఆఫర్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని, రూ.999 అతి తక్కువ ప్రారంభ ధరతో టికెట్ల అమ్మకాలను ప్రారంభించినట్టు ‘ఇండిగో’ ముఖ్య వాణిజ్య అధికారి విలియం బౌల్టర్ పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి ఈ ఆఫర్ కింద సేల్స్ ప్రారంభం కాగా, వీటి అమ్మకాలు 6వ తేది సాయంత్రం వరకు కొనసాగనున్నాయని సంస్థ వర్గాలు వెల్లడించాయి.

మోబైల్ వాలెట్ మొబిక్విక్ నుంచి అయితే దాదాపు రూ.600 వరకూ ఇరవై శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను కూడా అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. అతి తక్కువ ధరలకే విమాన టికెట్లను అందిస్తున్న కారణంగా ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని భావిస్తున్నట్టు విలియం బౌల్టర్ పేర్కొన్నారు. ఈ విధంగా టికెట్లు అమ్మడం ద్వారా మరిన్ని లాభాలు వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. దాదాపు పది లక్షల టికెట్లను విక్రయించే లక్ష్యంతోనే అతి తక్కువ ప్రారంభ ధరతో టికెట్ల అమ్మకాలను ప్రారంభించినట్టు ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indigo  festival sale offer  cheap flight tickets  goindigo.in  discount sale  10 lakh seats  

Other Articles