జపాన్ పై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఓ వైపు పెను తుఫాను వస్తుందని గత రెండు రోజులుగా భయాందోళనకు గురైన జపాన్ వాసులను ఇవాళ ఉదయం సంభవించిన శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. హొక్కాయ్ డో దీవిలో ఈ భూకంపం సంభవించింది. ప్రధాన నగరం సప్పోరోకు 68 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో దివి మొత్తం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆ దీవిలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను కూడా స్విచాఫ్ చేశారు. టొమోకొమై సిటీ కేంద్రంగా భూకంపం వచ్చింది.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. మరో 125 మంది తీవ్రంగా గాయపడ్డారు. 20 మంది ఆచూకీ లభించలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు యుద్దప్రాతిపదికన కొనసాగుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతుండటంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీవిలో సుమారు 20 లక్షల జనాభా ఉంది. భూకంపంతో సుమారు 125 మంది గాయపడ్డారు. మరో 20 మంది కనిపించకుండాపోయారు. యోషినో జిల్లాలో అయిదుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే జపాన్ ను భయంకర టైపూన్ చుట్టుముట్టింది. గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత భయంకరమైన టైపూన్ గా దీన్ని ప్రభుత్వం అభివర్ణించింది. గంటకు 216 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తీర ప్రాంతాల్లోని ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుండగా, 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు.దీనికి 'జెబీ' అని పేరు పెట్టగా, దీని ప్రభావం జపాన్ ద్వీపమైన శికోకుపై అత్యధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
శికోకులో ఎవరూ ఉండవద్దని హెచ్చరిస్తున్నారు. పోర్ట్ సిటీగా ఉన్న కోబెను ఖాళీ చేసి వెళ్లిపోవాలని, అక్కడ ఒక్కరు కూడా ఉండవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. జెబీ దెబ్బకు ప్రతిష్ఠాత్మక యూనివర్సల్ స్టూడియోను మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. స్టూడియోను తిరిగి ఎప్పుడు తెరుస్తామన్న విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. నగోయా, ఒసాకా విమానాశ్రయాలను మూసివేసిన అధికారులు, ఈ నగరాల నుంచి తిరిగే అన్ని విమాన సర్వీసులనూ రద్దు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more