హైదరాబాద్ లో సినిమా ధీయేటర్లు, మల్టీపెక్సుల్లోకి వెళ్లి సినిమాలు చేసే ప్రేక్షకుల నుంచి పార్కింగ్ ఫీజు పేరిట ఎలాంటి రుసుమును వసూలు చేయకూడదని కొన్న మాసాల క్రితం తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. పార్కింగ్ నిబంధనలు వచ్చి చాలా రోజులే అయ్యింది మాకు తెలుసులే.. అంటున్నారా.? అయితే ధియేటర్లకు వెళ్లి వాహనాల పార్కింగ్ ఫీజు ఎందుకు కడుతున్నారు.? ఔను.. ఎందుకు కడుతున్నాం అని అలోచనలో పడ్డారా.?
తాజా నిబంధనల ప్రకారం మాత్రం ధియేటర్లకు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకుడి నుంచి వాహనాల పార్కింగ్ పేరిట ఎలాంటి రుసుమును వసూళు చేయకూడదు. కానీ ధియేటర్ యాజమాన్యాలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రేక్షకుడి నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేసిన థియేటర్‌కు కోర్టు భారీ జరిమానా విధించింది. పార్కింగ్ ఫీజు వసూలు చేసి ప్రేక్షకుడిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.50 వేలు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
హైదరాబాద్‌కు చెందిన విజయ్‌గోపాల్ గతేడాది జూలైలో మహేశ్వరి పరమేశ్వరి థియేటర్లో సినిమా చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. కారు పార్కింగ్ కోసం సిబ్బంది అతడి నుంచి రూ.30 వసూలు చేశారు. నిబంధనలకు ఇది విరుద్ధమని నిర్వాహకులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆయన వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. వినియోగదారుల ఫోరం సదరు థియేటర్‌కు నోటీసులు పంపింది.
పార్కింగ్ ఫీజు లేకుంటే అందరూ వచ్చి ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్నారని, దానిని అరికట్టేందుకే పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్టు థియేటర్ యాజమాన్యం సమాధానం ఇచ్చింది. థియేటర్లో సినిమా చూసినా, ఏదైనా కొనుగోలు చేసినా పార్కింగ్ ఫీజును తిరిగి ఇవ్వాలన్న నిబంధన ఉన్నా, విజయ్‌గోపాల్ నుంచి వసూలు చేసిన ఫీజును వెనక్కి ఇవ్వకపోవడం అక్రమమని ఫోరం పేర్కొంది. విజయ్ గోపాల్‌ను మానసిక ఒత్తిడికి గురిచేసినందుకు గాను రూ.50 వేలు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పుపై విజయ్ గోపాల్ ఆనందం వ్యక్తం చేశారు. మిగతా థియేటర్లకు ఇదో హెచ్చరిక కావాలన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more