అభిమాన నటుడు తెరపై కనిపిస్తే చాలు.. ఎగిరి గంతేస్తారు అభిమానులు.. అలాంటిది ప్రత్యక్షంగా కనిపిస్తే ఆగుతారా? వెంటనే అభిమాన హీరో వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్, సెల్ఫీ దిగి ముచ్చట తీర్చుకుంటారు. కొన్నిసార్లు అభిమానం మితిమీరినప్పుడు అభిమాన హీరోకు కూడా చిర్రెత్తుకువస్తుంది. గతంలో అభిమానుల దూకుడుతో అసహనానికి గురైన సినీహీరో నందమూరి బాలకృష్ణ వారిని కొట్టిన సందర్భాలు ఎన్నో చూశాం.
అయితే సమయం ఎప్పుడు ఒకేలా వుండదు. సినీనటుడిగా ఎలా వున్నా.. రాజకీయ నేతగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు కాసింత సహనం అధికంగా వుండాలి. మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రచార వేళ.. తప్పకుండా అందరితో కలుపుగోలుగా వ్యవహరించాలి. అలా కాకుండా తన దారి.. అంటూ అదే పంథాలో వ్యవహరిస్తే.. మధిరలో జరిగిన పరిణామాలే ఎదురవుతాయి. వేనోళ్ల పొడిగిన అభిమానులే.. తమ అభిమానాన్ని చంపుకుని.. అభిమాన హీరో ఫ్లెక్సీలను, పొస్టర్లను చించివేశారు.
ఎక్కడా.. ఎప్పుడు అంటున్నారా.. తాజాగా ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో పర్యటించిన బాలయ్య అక్కడ అన్న నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అవిష్కరించారు. మధిర నుంచి మహాకూటమి తొలి విజయం అందుకుంటుందని కూడా చెప్పారు. అయితే ఈ పర్యటనలో బాలయ్య సహనానికి అభిమానులు మరో పరీక్ష పెట్టారు. అప్పటికే ఉక్కపోతతో చొక్కా విప్పేసి ర్యాలీలో పాల్గొన్న బాలకృష్ణకు అభిమానుల తాకిడితో మరింత అసహనానికి గురయ్యారు.
ఈ క్రమంలో తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద వాహనంలో నుంచి కిందకు దిగి ఓ అభిమానిని కాలితో తన్నినట్టు సమాచారం. బాలకృష్ణ తీరుపై ఆయన అభిమానులే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దాంతో బాలకృష్ణ అభిమానులే ఆయన ఫ్లెక్సీలను తగలబెట్టారు. అభిమానులు బాలకృష్ణ ప్లెక్సీలను తగలబెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరెందుకు ఆలస్యం.. మీరు ఓ లుక్కేయండీ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more