తెల్లవారి కబంధ హస్తాల నుంచి భరతమాత దాస్య శృంఖలాలను తెంచిన మహనీయుడు ఆయన! శాంతియుత మార్గంలోనే రక్తం చిందకుండా యావత్ దేశప్రజలను ఏకతాటిపై నడిపించిన మహానాయకుడు ఆయన! భారత గడ్డకు స్వేచ్ఛావాయువులు ప్రసాదించి.. మూడు వందల ఏళ్లకు పైగా కమ్ముకున్న చీకట్లను పారదోలి.. వెలుగురేఖలను ప్రసరింపజేసిన ధీశాలి! ప్రపంచానికి ‘అహింస’, ‘శాంతి’ని ఆయుధాలుగా అందించిన మార్గదర్శి! ఆయనే జాతిపిత మహాత్మాగాంధీ.
ఆ యుగపురుషుని 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భరతజాతి సంసిద్ధ మైంది. మంగళవారం దేశ వ్యాప్తంగా ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. మహాత్ముడిని తలచు కుంటూ ఈ ఏడాదంతా జయంతి వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. మహా త్ముడు ప్రవచించిన శుభ్రత, పారి శుధ్యం అనే భావనను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే ‘స్వచ్ఛ భారత్’ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 15 నుంచి ‘స్వచ్ఛతాహి సేవ’ కార్యక్రమాన్ని చేపట్టనుంది.
గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని రాజ్ ఘాట్ చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతిపితకు ఘన నివాళులు అర్పించారు. అంతకుముందు ప్రధాని నరేంద్రమోడీ.. కేంద్రమంత్రులు. అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మరెందరో రాజకీయ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జాతిపితకు ఘనంగా నివాళులు అర్పించారు. అటు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు, ప్రజలు కూడా గాంధీజీ సేవలను గుర్తుచేసుకున్నారు.
స్వచ్ఛత కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ‘ఆయన జీవితమే ఓ సందేశం’ ..అంటూ మహాత్ముడిని స్మరించుకుంటూ వివిధ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నాయి. మహాత్ముని 145వ జయంతి రోజున చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని.. జాతిపిత 150వ జయంతికి పూర్తి చేయనున్నట్లు అప్పట్లో ప్రధాని మోడీ ప్రకటించారు.
కాగా, గాంధీజీ అంటే కదల్లేని విగ్రహం కాదని.. దేశమంతా విస్తరించిన విలువలు, జీవించి ఉన్న ఆలోచనలు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించిన ఆయన.. ‘గాంధీజీ అంటే కదలలేని విగ్రహం కాదు, దేశమంతా విస్తరించి ఉన్న విలువలు, జీవించి ఉన్న ఆలోచనలు. సత్యం, అహింస.. వీటి కోసమే ఆయన జీవించారు, దేశం కోసం చనిపోయారు. నిజమైన దేశ భక్తులు ఆయన విలువలను కాపాడాలి’ అని కోరారు. బీజేపి అగ్రనేత ఎల్కే అడ్వాణీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తదితర ప్రముఖులు మహాత్మునికి నివాళులర్పించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more