ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల తీరుపై ఇప్పటికే పలు రకాల విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఉన్నాతాధికారులు వాటిని రూపుమాపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియా సాక్షిగా చేసుకుని మరీ ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు అక్కడ కూడా విమర్శలను ఎదుర్కొన్నారు. ఇలా విమర్శలను బాపుకునే ప్రతీ ఘటనలో వారు విమర్శల పాలవుతున్న క్రమంలో మరోమారు అదే విభాగానికి మచ్చ తెచ్చే ఘటన ఒకటి చోటుచేసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్ లోని చామద్ గేట్ పోలీస్ స్టేషన్ లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. పోలిస్ స్టేషన్ వేదికగా చేసుకుని అక్కడి ఓ బాలుడితో కొద్ది రోజులుగా అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కానిస్టేబుల్. అసహజ లైంగిక దాడికి పాల్పడటంతో పాటు వికృత చేష్టలతో తనను బౌతికంగా కూడా వేధించేవాడు. సదరు కానిస్టేబుల్ సెలవుపై వెళ్లడంతో.. ఆ విషయం తెలియక స్టేషన్ కు వచ్చిన బాలుడి అక్కడ వున్న ఉన్నతాధికారులకు విషయాన్ని చెప్పాడు. దీంతో ఆ కానిస్టేబుల్ ను యూపీ పోలీసులు సస్పెండ్ చేశారు.
యుపీలోని చామద్ గేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న 45 ఏళ్ల సంజేశ్ యాదవ్ అనే కానిస్టేబుల్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు నిర్థారించుకున్న పోలీసులు అతడిపై వెంటనే సస్పన్షన్ వేటు వేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. అనాథ అయిన ఓ బాలుడు రోడ్డు పక్కనున్న చిన్న హోటల్లో పనిచేసుకుంటున్నాడు. ఓ సారి గస్తీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సంజేశ్ యాదవ్ అల్పాహారం చేసేందుకు అక్కడికి వెళ్లాడు. బాలుడ్ని మచ్చిక చేసుకొని తరచూ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చేవాడు.
సెప్టెంబరు 9 నుంచి అక్టోబరు 1 మధ్య తరచూ బాలుడ్ని స్టేషన్‌కు రప్పించి అతడితో అసహజ లైంగిక చర్యలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు.ఈ నెల 2న కానిస్టేబుల్ సెలవుపై వెళ్లడంతో స్టేషన్‌కు వచ్చిన బాలుడు పోలీసు ఉన్నతాధికారులకు జరిగిన విషయం చెప్పాడు. వికృత చేష్టలు చేయడమే కాకుండా తనను భౌతికంగా గాయపర్చేవాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో బాలుడికి వైద్య పరీక్షలు జరిపించి.. బాలల లైంగిక వేధింపుల చట్టం (పోక్సో) కింద కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more