Kiran Bedi and MLA argue on stage సభలో ఎమ్మెల్యే ఆక్రోశం.. లెఫ్టినెంట్ గవర్నర్ తో వాగ్వాదం..

Puducherry mla anguish at meeting has a spat with kiran bedi

kiran bedi, puducherry governor, kiran bedi mla verbal spat, kiran bedi verbal spat, puducherry open defecation-free, Anbalagan, Anbalagan Kiran Bedi fight, puducherry, politics

Puducherry Lieutenant Governor Kiran Bedi attempting to stop the speech of a local MLA, leading to heated arguments on stage, and finally ordering that the microphone be switched off.

సభలో ఎమ్మెల్యే ఆక్రోశం.. లెఫ్టినెంట్ గవర్నర్ తో వాగ్వాదం..

Posted: 10/03/2018 03:49 PM IST
Puducherry mla anguish at meeting has a spat with kiran bedi

గవర్నర్ లంటే కేవలం రాజముద్రకు తప్ప.. వారికున్న విశేషాధికారాలను వినియోగించే స్వతంత్రం కూడా లేని వారని ఇప్పటికీ ఈ వ్యవస్థపై ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతున్నా.. లోకాయుక్త అమల్లో వున్న రాష్ట్రాల్లో మాత్రం కాసింత భయం వుంది. అయితే వీరికన్నా లెఫ్టినెంట్ గవర్నర్ అన్న పదం వినగానే ఆయా ప్రాంతాల ప్రభుత్వాలకు కూడా వణుకు పుడుతుంది. ఏకపక్ష మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వాన్ని, ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ పాలనను అక్కడి గవర్నర్ ఎలా నియంత్రించారో మనకు తెలిసిందే.

గవర్నర్ అనుమతి లేనిదే ఏ పని జరగకుండా.. పలు పథకాలను కూడా తొక్కిపెట్టిన నేపథ్యంలో.. సహనం నశించిన అప్ ప్రభుత్వం దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. గవర్నర్ దృష్టికి విషయాలను, పథకాలను తీసుకువెళ్తే సరని, అంతేకాని.. లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి అంత ముఖ్యం కాదని అత్యున్నత న్యాయస్థానం కూడా తేల్చిచెప్పింది. దీంతో ఈ విధానం రాష్ట్రంలోని అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించడంతో లెఫ్టినెంట్ గవర్నర్ అధిపత్యానికి కత్తెర పడినట్లు అయ్యింది.

ఇదిలావుంటే పుదుచ్ఛేరిలో మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తన అధిపత్యాన్ని ప్రదర్శిస్తూ.. తన నియోజకవర్గ అభివృద్దికి దోహదపడటం లేదని అమెపై.. అమె ఎదురుగానే అక్కడి ప్రజలు పెద్దస్థాయిలో వున్న గాంధీ జయంతోత్సవ వేడుకలలో అవేదన వెల్లగక్కారు అన్నాడీఎంకే ఎమ్మెల్యే అన్బాల్గాన్‌. దీంతో జయంతి వేడుకలు జరగాల్సిన వేదికపై జనం వీరిని చూసి నవ్వుకునే స్థాయి ఏర్పాడింది. ఫలితంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి అన్నాడీఎంకే ఎమ్మెల్యే అన్బాల్గాన్ కు మరోసారి మధ్య మాటల యుద్ధం నడిచింది.

పుదుచ్ఛేరిలోని ఉప్పాలమ్ లో గాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కిరణ్ బేడీ, అన్బాల్గాన్ కు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. వేదికపై ఎమ్మెల్యే అన్బాల్గాన్ మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో కిరణ్ బేడీ పనితీరు సరిగా లేదని, హామీలను నెరవేర్చలేదని విమర్శించడంతో ఇరువురి మధ్య వాగ్విదానికి తెరలేసింది. కిరణ్ బేడీ ఎంతగా సర్దిచెప్పినా అన్బాల్గాన్ ఆమెపై ఆరోపణలు చేశారు. ఈ సభ అందుకు వేదిక కాదు అని సర్థిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు అన్బాల్గాన్.

 దాంతో కిరణ్ బేడీకి చిర్రెత్తుకొచ్చి అతని మైక్ ను కట్ చేయమని అధికారులకు సూచించారు. దాంతో మరింత ఆగ్రహించిన అన్బాల్గాన్ గట్టిగా అరుస్తూ బేడీపై మాటల దాడికి దిగారు. ఎమ్మెల్యే ప్రవర్తనతో విసుగుచెందిన కిరణ్ బేడీ.. ఆయన్ను వేదికపై నుంచి దిగిపోమ్మని హెచ్చరించారు. అందుకు ఎమ్మెల్యే అన్బాల్గాన్ మీరే కిందికి దిగిపోండి అంటూ బదులిచ్చారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. సర్థి చెప్పే ప్రయత్నం చేసిన మంత్రిపైకి కూడా ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయ్యండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kiran Bedi  Anbalagan  Anbalagan Kiran Bedi fight  puducherry  politics  

Other Articles