Commuters save girl who slips off local train చావు ముంగిట్లోకి వెళ్లి.. బయటపడ్డ యువతి..

Girl nearly falls off train in mumbai pulled back by commuters

girl nearly falls off train, train, WhatsApp, pulled back by commuters, local trains, woman, humanity, Mumbai, Maharashtra

It’s a video of co-passengers saving a commuter from falling off a train, right in the path of an oncoming train, which has gone viral.

ITEMVIDEOS: స్టంటు చేసి చావు ముంగిట్లోకి వెళ్లి.. బయటపడ్డ యువతి..

Posted: 10/03/2018 05:05 PM IST
Girl nearly falls off train in mumbai pulled back by commuters

యువతలో ఉడుకు రక్తం ఏదైనా స్టంటు చేయాలంటే దాని పర్యవసానాలు ఎలా వుంటాయన్న విషయాన్ని అలోచించకుండా.. ఏం కాదులే.. అన్న నిర్లక్ష్య ధోరణి మరీ ఎక్కువవుతోంది. ఇప్పటికే స్టంట్లు చేయడంతో తమ నిండు నూరేళ్ల జీవితాన్ని కేవలం టీనేజ్ లోనే కోల్పోయిన యువత ఎందరో పొగొట్టుకున్నారు. వారి స్టంటు తాలుకు వీడియోలను చూసినా నేటి యువతకు బుద్ది రావడం లేదనే చెప్పాలి. కించింత్ భయం, జంకు, బొంకు లేకుండా స్టంట్లు చేయడం వారి తల్లిదండ్రులు అనేక వేదనలను ఎదుర్కోనేలా చేస్తుంది.

తాజాగా ఈ స్టంట్ల జాబితాలో చేరింది ఒక యువతి. తన అత్యుత్సాహంతో ప్రాణాలపైకి తెచ్చుకుంది. అత్సుత్యాహం కాస్తా.. ప్రాణగండంగా మారింది. ఏకంగా చావు ముంగిట్లోకి వెళ్లింది. అయితే ఆ యువతిని గమనించిన తోటి ప్రయాణికులు గమనించి.. రక్షించడంతో తృటిలో ప్రాణాలు దక్కించుకుని మృత్యుంజయురాలిగా మారింది. ఈ ఘటన ముంబైలోని ఓ లోకల్ రైలులో చోటుచేసుకుంది. యువతి చేయబోయిన స్టంట్ ఏంటో తెలుసా.. ఒక రైలు ఫుట్ బోర్డులో నిల్చుని.. ఎదురుగా వస్తున్న మరో రైలును టచ్ చేయాలని.

తలుచుకుంటేనే వణుకుపుడుతున్న ఈ స్టంట్ ను 17 ఏళ్ల అమ్మాయి చేయబోయింది. తాను చదువుకున్న పాఠ్యపుస్తకాల్లో అవతల ట్రాకుపై వెళ్తున్న రైలును తాకితే ఆ రైలు వెళ్లే వేగంగా వీచే గాలీకి అమె పడిపోతుందన్న విషయం చెప్పిందో లేదో కానీ.. ఇప్పుడామెకు ఆ విషయం పూర్తిగా అవగతమైంది.  అదెలా అంటే.. ఫుట్ బోర్డు వద్ద నిలబడిన 17 ఏళ్ల అమ్మాయి స్టంట్స్ చేయబోతూ, పట్టుజారి కిందకు పడిపోయింది.

ఆ సమయంలో పక్కనే నిలుచున్న ఓ యువకుడు ఆమె చెయ్యిని పట్టుకున్నాడు. ఆ వెంటనే పక్కనున్నవారు ఆమెను పైకి లాగారు. ఆ యువకుడు అమ్మాయి చేతిని పట్టుకోకుంటే రైలు వెళుతున్న వేగానికి ఆమె కచ్చితంగా మరణించి ఉండేదని ఈ వీడియో చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ అమ్మాయి స్టంట్స్ ను వీడియో తీస్తున్న ఓ కెమెరాలోఈ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : commuters  local trains  woman  humanity  Mumbai  Maharashtra  

Other Articles