భాద్రపద మాసం ముగిసి.. ఆశ్వయుజ మాసంలోకి అడుగుపెట్టి పెట్టగానే దేశంలో ఒక్కసారిగా ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. ఆశ్వయుజ మాసం తొలి రోజు నుంచే దేశవ్యాప్తంగా ప్రజలు దుర్గామాత శరన్నవరాత్రులను భక్తిశ్రద్దలతో ఆచరిస్తారు. ఆ తరువాత మాసం చివర్లో దీపావళి పండగతో ముగుస్తుంది. ఈపవిత్ర మాసం మొదలు తొమ్మిదిరోజుల పాటు అంకుఠిత దీక్ష, దక్షలతో, నిష్టగా ఉపవాస దీక్షలను కూడా ఆచరిస్తారు. పదో రోజు విజయదశమి సందర్భంగా రాత్రి వరకు దీక్షలో వుండే భక్తులు తెల్లవారి దీక్షను వదిలిపెడతారు.
ఈ దీక్షను కొందరు తమకు అనుగూనంగా కొన్ని మినహాయింపులతో చేపడతారు. కొందరు పళ్లు, కొబ్బరి నీళ్లుతో మాత్రమే దీక్షను కొనసాగించగా, మరికోందరు ఒంటిపూట బోజనంతో వుంటారు. భక్తుల వయస్సు ఇత్యాదులను పరిగణలోకి తీసుకుని పండితులు వారికి మినహాయింపులు కల్పిస్తారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ కూడా నవరాత్రి దీక్షలలో వుంటారన్న విషయం తెలిసిందే. ఆయన విదేశీ యాత్రలలోనూ తన దీక్షను కొనసాగించారు.
కాగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈ సారి పది రోజుల పాటు అమ్మవారి దీక్షను పూనుకున్నారు. చైత్రమాస దీక్షను అచరించే ఆయన ఈ సారి మాత్రం అమ్మవారి నవరాత్రి దీక్షను ఆచరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అధ్యాత్మిక భావన ఉట్టిపటేందుకు మరో అదనపు ఆకర్షణగా నిలిచేది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరగడమే. దీంతో తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసిన అధ్యాత్మిక శోభ పరడవిల్లుతుంది.
తిరుమలలో ఆశ్వయుజ మాసం తొలి రోజు నుంచి అంటే అమ్మవారి శరన్నావరాత్రులు ప్రారంభమయ్యే నాటి నుంచి 9 రోజుల పాటు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. బ్రహోత్సవాలలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. ఇక ఇవాళ సాయంత్రం శ్రీవారు పెద్దశేష వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగిస్తూ.. భక్తులకు అభయ ప్రధానం చేయనున్నారు. రేపు ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంసవాహన సేవలు జరుగనున్నాయి.
12న ఉదయం సింహ వాహనం, రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చే దేవదేవుడు, 13న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనంపై ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడోత్సవం 14న రాత్రికి జరుగనుంది. 15న హనుమంత వాహనం, పుష్పపల్లకి, గజవాహన సేవలు, 16న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు, 17న స్వర్ణ రథం, అశ్వవాహన సేవల తరువాత 18న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలకు 3 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది.
ఇక ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, శ్రీకాళహస్తి సహా అన్ని శైవ క్షేత్రాల్లో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజామునుంచే కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. నేడు అమ్మవారు స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. రాత్రి 11 గంటల వరకూ అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాలు జరిగే 9 రోజులూ నిత్యమూ లక్ష కుంకుమార్చన, చండీయాగాలు జరుగుతాయని, రెండుపూటలా అన్న ప్రసాద వితరణ ఉంటుందని అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more