‘దూకుడు’ చిత్రంలో సైడ్ విలన్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ ను మాదకద్రవ్యాల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కాగా తనపై కుట్రపూరితంగానే పోలీసులు కేసు బనాయించారని నటుడు అరోపిస్తున్నాడు. తానంటే గిట్టని కొందరు పెద్దలు, మీడియాతో చేతులు కలిపి.. తనపై కుట్రపూరితంగానే ఈ కేసును బనాయించారని పేర్కోంటున్నాడు. తాను మంచి కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకే ఈ తరహా కుట్రతో తనను అన్యాయంగా ఇరికించారని అన్నాడు.
కాగా, దూకుడు చిత్రంలో ప్రధాన విలన్ సోనూసూద్ తమ్ముడి పాత్ర పోషించిన అజాజ్ ఖాన్ ను పోలీసులు అరెస్టుచేశారు. అయితే పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఆయన వద్ద రూ.2.2 లక్షల విలువచేసే మాదకద్రవ్యాలు కూడా వున్నాయి. నవీ ముంబైలోని బేలాపూర్లో ఉన్న ఓ హోటల్ లో అజాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక అలస్యం చేయకుండా అజాజ్ ను కోర్టులో హాజరుపరచగా అతనికి రెండు రోజుల పోలీస్ కస్టడీని విధించారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై కుట్ర చేసి కేసులో ఇరికించారని అజాజ్ అంటున్నాడు. అంతేకాకుండా తనను సమర్థించుకుంటూ అజాజ్ ఒక ట్వీట్ కూడా చేశాడు. ‘జొమాటో డెలివరీ బాయ్స్ కు సహాయం చేస్తే అది నేరం. నేనొక నేరస్థుడిని. తప్పులు చేసే రాజకీయ నాయకులను ప్రశ్నిస్తే అది నేరం. నేనొక నేరస్థుడిని. బడా బాబులు పక్కా ప్రణాళికతో చేసిన కుట్ర ఇది. నేనేంటో నా కుటుంబానికి తెలుసు. అల్లా నా వెంట ఉన్నాడు’ అని అజాజ్ తన ట్వీట్లో పేర్కొన్నాడు.
If helping the delivery boys of Zomato was a crime, I'm a criminal.
— Ajaz Khan (@AjazkhanActor) October 23, 2018
If speaking against the wrong doing of Politician was a crime, I'm a criminal.
P.S: This all is a conspiracy Planned by the biggies & Dear Media & Haters this "?" won't help as I know my family & Allah is with me
అజాజ్ అరెస్టు గురించి నవీ ముంబై డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) తుషార్ దోషి స్పందిస్తూ.. ‘పక్కా సమాచారం ప్రకారం బెలాపూర్ లోని హోటల్ పై దాడి చేసి ఓ గదిలో ఉన్న 38 ఏళ్ల నటుడు అజాజ్ ఖాన్ ను అరెస్టు చేశామని చెప్పారు. ముంబైలోని అంథేరిలో నివాసముండే అజాజ్ ఖాన్.. టాబ్లెట్ల రూపంలో ఉన్న నార్కోటిక్ డ్రగ్ ను తీసుకుంటుండగా అతన్ని అరెస్టు చేశామని వెల్లడించారు.
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద అతన్ని అరెస్టు చేసినట్లు నవీ ముంబై పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా, అజాజ్పై పోలీస్ కేసు కొత్తేమీ కాదు. 2016లో 36 ఏళ్ల హెయిర్ స్టైలిస్ట్కు అసభ్యకర ఫొటోలు, మెసేజ్లు పంపి అరెస్ట్ అయ్యాడు. ఆ తరవాత బెయిల్పై విడుదలయ్యాడు. అజాజ్ తెలుగులో మొత్తం ఏడు సినిమాల్లో నటించాడు. దూకుడు, నాయక్, బాద్షా, హార్ట్ ఎటాక్, వేట, టెంపర్, రోగ్ చిత్రాల్లో అజాజ్ నెగిటివ్ రోల్స్ చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more