UP Minister challenges BJP to rename Red Fort యూపీ సర్కారుకు సవాల్ విసిరిన మంత్రి

I dare centre to rename lal qila up minister op rajbhar

Yogi ministry, Om Prakash Rajbhar, challange, Lal Quila, Red Fort, Rajbhar, Giriraj singh, Sher Shah Suri, Allahabad, Prayagraj, Government of Uttar Pradesh, Uttar Pradesh Council of Ministers, Suheldev Bharatiya Samaj Party, Uttar Pradesh's Cabinet, Chief Minister, Uttar Pradesh, Bharatiya Janata Party, State governments of India, Politics

Uttar Pradesh's Cabinet Minister of Backward Class Welfare and Divyangjan Empowerment Om Prakash Rajbhar has challenged the BJP government to change the name of the historic Lal Quila or Red Fort.

యూపీ సర్కారుకు దిమ్మదిరిగే సవాల్ విసిరిన మంత్రి

Posted: 10/24/2018 03:03 PM IST
I dare centre to rename lal qila up minister op rajbhar

ఉత్తరప్రదేశ్ లోని యోగీ అదిత్యనాథ్ ప్రభుత్వానికి, అదే రాష్ట్ర కేబినెట్ కు చెందిన మంత్రి సంచలన సవాల్ విసిరారు. రాష్ట్రంలోని యోగీ ప్రభుత్వానికి చేసేందుకు పనిలేక పేర్లు మార్చుకుంటూ కూర్చుంటుందని.. దానిని కేంద్రమంత్రి కూడా అభినందించడం హేయకరమని ఆయన అన్నారు. కేంద్రంలోని చారిత్రక ఎర్రకోట పేరును బీజేపీ సర్కారు మార్చగలదా అని మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ అధికార బీజేపీకి సవాలు చేశారు. లేని పక్షంలో కనీసం దానిని కూల్చగలదా.? అని ప్రశ్నించారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని అధికార బీజేపీ ప్రభుత్వంలో మిత్రపక్షంగా కోనసాగుతున్న సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడైన ఓం ప్రకాష్ రాజ్‌భర్ ఈ మేరకు బీజేపి సర్కార్ ను ఇబ్బందిపెట్టే వ్యాఖ్యలు చేస్తూ సవాల్ విసిరారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, దివ్యాంగుల సాధికారత శాఖా మంత్రిగా కొనసాగుతున్న ఆయన.. యూపీ ప్రభుత్వానికి చేయడానికి పని లేక ప్రజల దృష్టిని మళ్లించేందుకే చారిత్రక ప్రాంతాల పేర్లను మారుస్తుందని రాజ్‌భర్ ఆరోపించారు.

బీజేపీ నాయకులకు ధైర్యముంటే లాల్ ఖిలా పేరు మార్చండి... లేదంటే దాన్ని కూల్చివేయండి అంటూ రాజ్ భర్ సవాలు విసిరారు. 2019 కుంభమేళా నేపథ్యంలో జరిగిన సమావేశంలో అలహాబాద్ పేరును ప్రయాగరాజ్ గా మారుస్తూ యూపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని రాజ్ భర్ తప్పు పట్టారు. మొగల్స్ పాలనలో పెట్టిన పేర్లను మార్చడంపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను అభినందించడాన్ని ఆయన తప్పుబట్టారు.

అదిచాలదన్నట్లు ఇలా వంద ప్రాంతాల పేర్లు మార్చాలని కేంద్ర మంత్రి సూచించడంపై రాజ్ భర్ అసంతఈప్తి వ్యక్తం చేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన గిరిరాజ్ సింగ్ తాత జీటీరోడ్డును నిర్మించారా అని యూపీ మంత్రి ప్రశ్నించారు. షేర్ షా సూరి నిర్మించిన జీటీరోడ్డుపై కేంద్రమంత్రి గిరిరాజ్ నడుస్తున్నాడని రాజ్‌భర్ చెప్పారు. ముందు కనీసం ఒక్క రోడ్డు అయినా నిర్మించి పేర్లు మార్చాలని కేంద్రమంత్రి గిరిరాజ్ ప్రకటనలు చేయాలని రాజ్ భర్ హితవు పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yogi ministry  Om Prakash Rajbhar  Sher Shah Suri  Red Fort  Giriraj singh  Uttar Pradesh  Politics  

Other Articles