విశాఖపట్నం విమానాశ్రయంలో తమ అధినేతకు పరాభవం జరగడం ఇది రెండోసారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇదే వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్ ను రన్ వే పైనే పోలీసు అధికారులు నిర్బంధించారని రోజా గుర్తు చేశారు. లోకల్ పోలీసులు సివిల్ డ్రస్సులో వచ్చి అడ్డుకున్నారని చెప్పారు. అదే విమానాశ్రయంలో ఇప్పుడు ఏకంగా పందెం కోళ్లకు కట్టే కత్తితో జగన్ పై ఓ దుండగుడు దాడికి యత్నించాడని మండిపడ్డారు.
దీని వెనుక ప్రభుత్వ వైఫల్యం ఉందని... ఈ దాడికి యత్నించిన వ్యక్తిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతకే రక్షణ లేకపోతే... సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాజకీయంగా జగన్ అంతమొందించేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఎంతో సెక్యూరిటీ ఉండే ఎయిర్ పోర్టులో ఒక వ్యక్తి కత్తితో ఎలా సంచరిస్తున్నారని అమె ప్రశ్నించారు. అసలు విమానాశ్రయంలోకి కత్తి ఎలా వచ్చిందని అమె నిలదీశారు.
పందెం కోళ్లకు కట్టే కత్తులకు విషం పూస్తారని అందోళన వ్యక్తం చేసిన ఆమె.. ఒకవేళ ఈ కత్తికి కూడా విషం పూసి వుంటే పరిస్థితి ఏమిటని అమె నిలదీశారు. తమ నేతపై చిన్న చాకుతో దాడి చేశారని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయని... ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే, దాన్ని చిన్న విషయంగా తీసి పారేస్తారా? అని మండిపడ్డారు. జగన్ కు ఏమైనా అయితే ఊరుకోబోమని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నామని రోజా వార్నింగ్ ఇచ్చారు.
కాగా, ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర హోం మంత్రి చిన్నరాజప్ప మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఠాణేలంక ప్రాంతానికి చెందిన జనిపెల్ల శ్రీనివాస్ అనే యువకుడు జగన్పై దాడి చేశారన్నారు. అతను విమానాశ్రయంలోనే ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంటులో వెయిటర్ గా పని చేస్తున్నాడని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని దాడిని ఖండిస్తున్నానని చెప్పారు. శ్రీనివాస్ ఎవరు? ఏమిటి? ఏ పార్టీకి చెందిన వాడు ఇలాంటి పూర్తి వివరాల్ని సేకరిస్తున్నాము. ప్రజలందరూ అర్ధం చేసుకోవాలని కోరుతున్నామని అన్నారు.
భద్రతా వైఫల్యం వల్లే జగన్ పై దాడి జరిగిందన్న వైసీపీ వాదనకు కౌంటర్ ఇస్తూ.. జగన్ సెల్ఫీ అనగానే ముందుకొచ్చి ముద్దులంటాడు. అతడు జగన్ పొగడటానికి వచ్చాడు.. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రజాప్రతినిధిపై ఉంటుంది. మాతో కూడా సెల్ఫీలు దిగుతున్నారు మేం జాగ్రత్తగా ఉంటున్నాము. ఏది ఏమైనా.. అతడు ఎంతవాడైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారని ఆయన చెప్పారు. మరో గంట నుంచి రెండు గంటల వ్యవధిలో శ్రీనివాస్ కు చెందిన సమస్త సమాచారం వెల్లడిస్తామని చిన్నరాజప్ప చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more