తెలంగాణలోని ఇంకా అనేక గ్రామాలో ఇంకా చాటింపు పద్దతి అమల్లో వుంది. శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగా అభివృద్ది చెందినా.. అవి పట్టణాలకే పరిమితం అవుతున్నాయి. అయితే గ్రామాలకు చేరినా అతి తక్కువ మంది మాత్రమే వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా యాదాద్రి జిల్లాలోని ఓ గ్రామంలో వేసిన చాటింపు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడమే కాదు.. గ్రామంలోని ఓ ముగ్గురు వ్యక్తులపై కూడా పోలీసు కేసులు నమోదు కావడానికి కారణమయ్యింది.
అదెలా అంటే ఓ పార్టీ పెట్టనున్న సమావేశానికి వస్తే రూ. 300 ఇస్తారని టముకు వేయించి ప్రచారం చేస్తుండటం, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా, అది వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లి గ్రామంలో, "యాదగిరి గుట్టలో జరిగే మీటింగ్ కు వస్తే 300 రూపాయలు ఇస్తారంటహో.." అంటూ లింగరాజుపల్లి గ్రామంలో వేసిన దండోరా.. అతనికి శాపంగా పరిణమించింది.
గ్రామంలోని ఎడ్లకాడి వెంకటయ్య అనే వృద్దుడు దండోరా వేస్తూంటాడు. ఎప్పటిలాగానే గ్రామంలోని రేషన్ దుకాణంలో నిత్యావసర సరుకులు వచ్చాయని అతడు చాటింపు వేసి వెళ్తున్న సమయంలో అతనికి ఎదురుగా వచ్చిన ఎర్ర కృష్ణారెడ్డి తండ్రి మోహన్ రెడ్డి వచ్చి, యాదగిరిగుట్టలో తమ మీటింగ్ కు వస్తే, రూ.300 ఇస్తామని దండోరా వేయమని చెప్పాడు. అందుకుగాను డబ్బును కూడా చేతిలో పెట్టాడు. దీంతో చాటింపు వేస్తున్నాననే అనుకున్న వెంకటయ్య.. అమాయకంగా ఆదే విషయాన్ని గ్రామంలో దండోరా వేయించాడు.
ఓటర్లను ప్రలోభ పెడుతున్నారన్న విషయాన్ని గ్రహించడంతో పాటు.. ఇలా బహిరంగంగా చాటింపు వేసి మరీ గ్రామస్థులను మీటింగ్ కు రావాలని కోరడం నేరమని టముకు వేసిన చెప్పిన విషయాన్ని రాజేందర్ రెడ్డి భావించాడు. వెంటనే వెంకటయ్యను పిలిచి.. తాను వేస్తున్న చాటింపును మరోసారి చెప్పాలని కోరి.. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అదికాస్తా వైరల్ కావడంతో రంగంలోకి దిగిన తహసీల్దార్ జ్యోతి వెంకటయ్యను విచారించి, అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దీంతో మీటింగ్ కు వస్తే డబ్బులిస్తామని దండోరా వేయించిన కృష్ణారెడ్డి, చాటింపు వేసిన వెంకటయ్య, సెల్ ఫోన్ లో రికార్డు చేసిన రాజేందర్ రెడ్డిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more