కర్ణాటకలో ఈ నెల మూడున మూడు లోక్సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప-ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి తన జైత్రయాత్రను కోనసాగిస్తుంది. ఒక్కస్థానంలో ముందంజలో వున్న బీజేపి తన పరువు దక్కించుకునే ప్రయత్నంలో వుంది. ఈ నెల మూడున జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడి కానున్నాయి. దీంతో ఉదయం 8గంటల నుంచే అధికారులు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు విడుదలయ్యాయి.
రామనగర అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి, జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామి ఘన విజయం సాధించారు. అమె ఎన్నిక లాంఛనమే అని ఈ నెల 1నే తేలిపోయింది. ఈ స్థానం నుంచి బీజేపీ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థి ఎల్ చంద్రశేఖర్ పోలింగ్ కు మూడు రోజుల ముందే ఆ పార్టీకి రాజీనామా చేసి తన మాతృపార్టీలో చేరారు. ఇక జమఖండిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సిద్దూ న్యామగౌడ తనయుడు కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ ఎస్ న్యామగౌడ 50 వేలు ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఆయన తన ప్రత్యర్థి బీజేపి అభ్యర్థి శ్రీకాంత్ కులకర్ణీపై ఘనవిజయాన్ని సాధించారు,
ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం శివమొగ్గ లోకసభ స్థానంలో తప్పా మిగతా రెండు చోట్ల అధికార కాంగ్రెస్- జేడీఎస్ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బీజేపీకి కంచుకోటలా భావించే బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్ప 1.5 లక్షల పైచిలుక ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గతంలో ఈ స్థానం నుంచి గెలుపొందిన బీజేపీ నేత శ్రీరాములు, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీల రికార్డులు మొత్తం ఈసారి బ్రేక్ అయ్యాయి.
ఇక, మాండ్య పార్లమెంటు స్థానంలో జేడీఎస్ అభ్యర్థి ఎల్ఆర్ శివరామ గౌడ సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన సిద్ధరామయ్యపై దాదాపు 2.5 లక్షల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో అత్యధిక మెజార్టీ 1.24 లక్షలు కాగా ప్రస్తుతం దాన్ని శివరామ గౌడ అధిగమించారు. కాంగ్రెస్ నేత, నటుడు అంబరీష్ 2004 ఎన్నికల్లో ఇక్కడ నుంచి 1,24, 438 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ప్రస్తుతం దీనికి రెండింతలు మెజార్టీతో జేడీఎస్ అభ్యర్థి దూసుకుపోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more